Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : నమ్రత మేడం సర్‌ మేడం అంతే..!

తాజాగా నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అందమైన ఫోటోలను షేర్‌ చేసింది. విభిన్నమైన డిజైనర్‌ ఔట్‌ ఫిట్‌ను ధరించిన నమ్రత అంతే స్టైలిష్‌ ఆభరణాలు ధరించడం ద్వారా చాలా ఆకర్షణీయంగా కనిపించింది.

By:  Tupaki Desk   |   6 Jun 2025 11:43 AM IST
పిక్‌టాక్‌ : నమ్రత మేడం సర్‌ మేడం అంతే..!
X

ఈ జనరేషన్‌ ప్రేక్షకులకు నమ్రత శిరోద్కర్‌ కేవలం మహేష్ బాబు భార్యగా మాత్రమే తెలుసు. కానీ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే ఆమె స్థాయి ఏంటో అందరికీ అర్థం అవుతుంది. 1993లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి సూపర్‌ హిట్స్‌ను సైతం అందుకుంది. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలు సినిమాల్లో నటించింది. మహేష్ బాబుతో ప్రేమలో పడ్డ నమ్రత శిరోద్కర్‌ ఆయన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరం అయింది. ఆమె ఫ్యామిలీ వ్యవహారాలు చూసుకుంటే ఈ జనరేషన్‌కి కేవలం మహేష్ బాబు భార్యగా మాత్రమే గుర్తు ఉండి పోయేలా ఆమె లో ఫ్రొఫైల్‌ను మెయింటెన్ చేస్తూ వస్తుంది.

అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో నమ్రత తన హద్దులు దాటకుండా, పరిధిలో ఉంటూ అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. చాలా మంది పెళ్లి అయిన హీరోయిన్స్‌ అందాల ఆరబోత చేస్తూ ఇప్పటికీ వార్తల్లో ఉన్నారు. వారి ఫామ్‌ కోల్పోయినా కూడా స్కిన్‌ షో చేయడం ద్వారా వార్తల్లో నిలవాలని ప్రయత్నాలు చేస్తున్న వారు కొందరు ఉన్నారు. కానీ నమ్రత మాత్రం ఎప్పుడూ చాలా హుందగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. ఆమె తన గౌరవ, మర్యాదలు కాపాడుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. నమ్రత భార్య కావడం అనేది మహేష్ బాబు అదృష్టం అంటూ చాలా మంది అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అందమైన ఫోటోలను షేర్‌ చేసింది. విభిన్నమైన డిజైనర్‌ ఔట్‌ ఫిట్‌ను ధరించిన నమ్రత అంతే స్టైలిష్‌ ఆభరణాలు ధరించడం ద్వారా చాలా ఆకర్షణీయంగా కనిపించింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ నమ్రత సొంతం అంటూ ఉంటారు. ఆమె వయసు పెరిగినా కొద్ది మరింత అందంగా కనిపిస్తుందని, మిస్‌ ఇండియా సమయంలో ఎంత అందంగా ఉందో అంతే అందంగా కనిపిస్తుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నమ్రత సోషల్‌ మీడియాలో ఇలాంటి ఫోటోలను రెగ్యులర్‌గా షేర్‌ చేయాలని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. తరుణ్ తాహిళాని డిజైన్‌ చేసిన ఈ ఔట్ ఫిట్‌ నమ్రత ధరించడంతో మరింత అందంగా కనిపిస్తుందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో నమ్రత ఏ ఫోటోలు షేర్‌ చేసినా వెంటనే వైరల్‌ అవుతూ ఉంటాయి. ఎక్కువ శాతం తన పిల్లలు గౌతమ్‌, సితార ఫోటోలను షేర్‌ చేస్తూ ఉండే నమ్రత ఈసారి మాత్రం తన పిక్స్‌ను షేర్ చేసింది. ఇంత అందంగా ఉన్న నమ్రత ఎందుకు సినిమాలకు దూరం అయిందని అభిమానులు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల బాధ్యత ఉన్న కారణంగా అప్పుడు సినిమాలకు దూరంగా ఉన్న నమ్రత ఇప్పుడు అయినా రీ ఎంట్రీ ఇవ్వచ్చు కదా అంటున్నారు. ఆ మధ్య రేణు దేశాయ్ తో పాటు పలువురు రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. వారిలాగే నమ్రత ఏదో ఒక రోజున రీ ఎంట్రీ ఇస్తుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి నమ్రత మనసులో ఏముందో తెలియాల్సి ఉంది.