Begin typing your search above and press return to search.

ఆస్కార్ వేదిక‌పై గోచీ రాయుడు?

ఈ వేదిక‌పై జాన్ సెనా యాక్ట్ కి అహూతులు క‌డుపుబ్బా న‌వ్వుకున్నారు.

By:  Tupaki Desk   |   11 March 2024 4:46 PM GMT
ఆస్కార్ వేదిక‌పై గోచీ రాయుడు?
X

ఆస్కార్స్ 2024 వేదిక‌పై చిత్ర‌విచిత్రాలు నెటిజ‌నుల్లో చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యాయి. ముఖ్యంగా న‌టుడు కం రెజ్ల‌ర్ జాన్ సెనా పూర్తి న‌గ్నంగా వేదిక‌పైకి దూసుకు రావ‌డం.. అత‌డు రాగానే ఒక పెద్ద బెడ్ షీట్ లాంటి వ‌స్త్రాన్ని తెచ్చి క‌ప్పేయ‌డం వంటి స‌న్నివేశాలు బోలెడంత ఫ‌న్ ని క్రియేట్ చేసాయి. ఈ వేదిక‌పై జాన్ సెనా యాక్ట్ కి అహూతులు క‌డుపుబ్బా న‌వ్వుకున్నారు.

ఇదంతా ఒక స్కిట్ అనుకుంటే, ఈ స్కిట్ కోసం కోట్లాది మంది వీక్షిస్తున్న ఈ వేదిక‌కు అత‌డు నిజంగానే న‌గ్నంగా వ‌చ్చేశాడా? అంటే అలాంటిదేమీ లేద‌ని తాజాగా రిలీజైన తెర‌వెన‌క ఫోటోలు చెబుతున్నాయి. అత‌డు న‌గ్నంగా ఉన్నాడు. కానీ కింద గోచీ ఉంది. దీనికి ప‌ల్లెల్లో రైత‌న్న పొలంలో క‌ష్ట‌ప‌డేప్పుడు క‌ట్టుకునే గోచీతో పోలిక ఉంది. కేవ‌లం ఆ భాగాన్ని ఆచ్ఛాద‌న లేకుండా వ‌దిలేయ‌డం బావుండ‌దు క‌నుక అత‌డు గోచీతో క‌వ‌ర్ చేసాడ‌న్న‌మాట‌.

అయితే ఈ గోచీ వేదిక దిగువ‌న ఉన్న అహూతుల‌కు క‌నిపించ‌లేదు. దానిని క‌వ‌ర్ చేస్తూ ఒక క‌వ‌ర్ అడ్డు పెట్టుకున్నాడు అత‌డు. దీంతో పూర్తి న‌గ్నంగా వేదిక‌పైకి వ‌చ్చేశాడేమిటా! అంటూ అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఏది ఏమైనా ఈ స్కిట్ క‌డుపుబ్బా న‌వ్వించ‌డంలో ఫెయిల్ కాలేదు. అలాగే ఈ స్కిట్ ముఖ్య ఉద్ధేశం సినిమాకి కాస్ట్యూమ్స్ డిజైన్ ప్రాధాన్య‌త ఎలాంటిదో తెలియ‌జేయ‌డం.

ఆస్కార్ వేదిక‌పై జాన్ సెనా యాక్ట్ అటుంచితే.. అత‌డు తెరవెనుక తన WWE మాజీ ప్రత్యర్థి ఇప్పుడు హాలీవుడ్ సహనటుడైన ది రాక్‌ని కలిశాడు. ఆ రోజుల్లో WWEలో ది రాక్ త‌న‌కు శ‌త్రువే అయిన‌ప్ప‌టికి ఆస్కార్స్‌లో సెనాతో నవ్వుతూ కరచాలనం చేస్తూ కనిపించాడు.

అభిమానులు దీనికి వేగంగా రియాక్ట్ అయ్యారు. X లో అభిమానుల నుండి ఉల్లాసకరమైన కామెంట్లు క‌నిపించాయి. ఒక నెటిజ‌న్ `జాన్ సెనా ఒక నేష‌న‌ల్ ట్ర‌బుల్‌` అని అన్నారు. లైవ్ ఈవెంట్‌లో మాకు ది రాక్ - జాన్ సెనా ఉన్నారు.. కానీ వారు కనీసం కొన్ని పంచ్‌లు ఒక‌రిపై ఒక‌రు ఎందుకు వేయరు? అని ఒక అభిమాని కొంటెగా ప్ర‌శ్నించాడు. ది రాక్ vs ది ఫ్రాక్ అని.. బౌద్ధ సన్యాసి జాన్ సెనా ఒక ఆశ్చర్యం..అని కూడా కామెంట్లు చేసారు.