Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : థాయ్‌ అందాల నడుమ నైరా స్కిన్‌ షో

తెలుగు సినిమా 'ఆ ఒక్కడు'తో 2009లో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నైరా బెనర్జీ. మొదటి సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు.

By:  Tupaki Desk   |   10 July 2025 2:00 PM IST
పిక్‌టాక్‌ : థాయ్‌ అందాల నడుమ నైరా స్కిన్‌ షో
X

తెలుగు సినిమా 'ఆ ఒక్కడు'తో 2009లో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నైరా బెనర్జీ. మొదటి సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. అయినా కూడా ప్రయత్నాలు ఆపలేదు. తదుపరి ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాల్లోనూ నటించింది. కానీ అక్కడ, ఇక్కడ ఆశించిన స్థాయిలో విజయాలను దక్కించుకోలేక పోయింది. రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన ఆరంజ్‌ సినిమాలో స్పెషల్‌ అప్పియరెన్స్ ఇచ్చింది. అది కూడా ఈమెకు ఆఫర్లు తెచ్చి పెట్టడంలో విఫలం అయింది. తెలుగులో ఈమె చేసిన సినిమాలు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఇప్పటికీ ఈమెకు తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు లేదని చెప్పాలి.


మలయాళం, కన్నడం, తమిళ్‌ భాషల సినిమాల్లోనూ ఈమెకు ఆఫర్లు వచ్చాయి. కానీ అవేవి ఈమె కెరీర్‌కి టర్న్‌ తీసుకు రాలేక పోయాయి. దాంతో 2017 నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కన్నడంలో ఈమె నటించి పులి సినిమా చివరిది. వెండి తెరకు దూరంగా ఉంటున్న నైరా బెనర్జీ బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చింది. బుల్లి తెరపై ఈమెకు మంచి స్పందన లభించింది. 2019 నుంచి బుల్లి తెరపై ఈమె సందడి కొనసాగుతోంది. హిందీ టీవీ షోలు, రియాల్టీ షో ల్లో ఈమె పాల్గొనడం ద్వారా గుర్తింపు దక్కించుకుంది. ఆకట్టుకునే అందం తో పాటు, మంచి ఫిజిక్ ఉన్నప్పటికీ ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాకపోవడంతో ఇప్పటి సినిమాల్లో సక్సెస్‌ దక్కించుకోలేదు.


కరోనా సమయం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమెకు చిన్నా చితకా ఆఫర్లు వచ్చినా సున్నితంగా తిరష్కరిస్తుందని తెలుస్తోంది. అయితే సోషల్‌ మీడియాలో ఈమె రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూనే ఉంటుంది. తాజాగా థాయ్‌లాండ్‌లో సెయిలింగ్‌కు వెళ్లాను అంటూ కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. అక్కడి అందాలను పంచుకున్న నైరా తన అందాల విందును చేసింది. నైరా అందాలకు నెటిజన్స్ చూపు తిప్పుకోలేక పోతున్నారు. ఈ మధ్య కాలంలో నైరా బెనర్జీ సోషల్‌ మీడియాలో ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం వల్ల వార్తల్లో నిలుస్తోంది. అందమైన పింక్‌ బికినీలో ఈమె చాలా అందంగా కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


అందమైన థాయిలాండ్‌లో అంతకు మించిన అందమైన నైరా బెనర్జీ అందాల ఆరబోత ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇంత అందంగా ఉంటే ఎలా అమ్మడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి జోరు కంటిన్యూ అవుతోంది. ఏకంగా ఆరు మిలియన్‌లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ అమ్మడు ఏ ఫోటోలు షేర్ చేసినా వైరల్‌ అవుతూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఈ ఫోటోలతో మరోసారి ఆమె వైరల్‌ అవుతోంది. నైరా ఇంత అందంగా ఉన్నా సినిమా ఇండస్ట్రీలో రావాల్సిన గుర్తింపు దక్కక పోవడం నిరాశను కలిగిస్తుందని చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తన్నారు. నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్నా కూడా ఈ అమ్మడి యొక్క అందాల జోరు మాత్రం తగ్గడం లేదు.