Begin typing your search above and press return to search.

డ్యాన్సులతోనే మ‌త్తెక్కిస్తున్న కృతి స‌నోన్

ఈ బ్యూటీ 'నైనా..' సాంగ్ లో అద్భుత‌మైన నృత్యాలు చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

By:  Tupaki Desk   |   16 March 2024 3:42 AM GMT
డ్యాన్సులతోనే మ‌త్తెక్కిస్తున్న కృతి స‌నోన్
X

1-నేనొక్క‌డినే సినిమాతో టాలీవుడ్ లో ప్ర‌వేశించిన కృతి స‌నోన్ ఆ త‌ర్వాత దోచేయ్ సినిమాలో న‌టించింది. కెరీర్ ఆరంభమే ఫ్లాపులు ఎదురయ్యాయి. లుక్స్ ప‌రంగా అంతంత మాత్ర‌మే అని విమ‌ర్శ‌లు ఎదురైనా త‌న‌దైన‌ న‌ట‌ప్ర‌తిభ‌తో ఈ భామ మైమ‌రిపించింది.

ఇక తెలుగులో ఫ్లాపులు ఎదురయ్యాక కృతి పూర్తిగా బాలీవుడ్ కే అంకిత‌మైంది. అక్క‌డ వ‌రుస‌గా హిట్ చిత్రాల్లో న‌టించింది. ఇటీవ‌లే మిలీ చిత్రంలో న‌టన‌కు గాను జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డును అందుకుంది.

ఇటీవ‌ల 'క్రూ' అనే కామెడీ మూవీలో న‌టించింది. టబు, కరీనా కపూర్ స‌హా కుర్ర బ్యూటీ ప్రధాన పాత్రను పోషిస్తోంది. ముగ్గురూ ఇందులో ఎయిర్ హోస్టెస్‌లుగా కనిపిస్తున్నారు. అయితే వీళ్లు దొంగ‌త‌నాలు చేస్తూ గ్లామ‌ర్ ని ఒల‌క‌బోస్తూ చేస్తున్న ర‌చ్చ మామూలుగా లేదు. ఈ బ్యూటీ 'నైనా..' సాంగ్ లో అద్భుత‌మైన నృత్యాలు చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

త‌న‌దైన సొగ‌సును ఆవిష్క‌రిస్తూ.. ఒంపుసొంపుల‌ను ఆర‌బోస్తూ.. నైనా ఈ పాట‌లో కృతి మెరుపులు మెరిపించింది. త‌న డ్యాన్సింగ్ శైలితో ఆక‌ర్షించింది. దీంతో పాటు అంద‌చందాల‌ను యువ‌త‌రం త‌థేకంగా గ‌మ‌నించేంత‌గా ఆక‌ర్షిస్తోంది కృతి. ఈ భామ‌లో గ్లామ‌ర్ డోస్ అమాంత పెరిగిన‌ట్టే క‌నిపిస్తోంది. కృతి గ్లామ్ లుక్ కి యూత్ ఫిదా అయిపోతున్నారు. క్రూ త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో ముగ్గురు భామ‌ల గ్లామ‌ర్ ట్రీట్ కోసం యూత్ ఉత్కంఠ‌గా వేచి చూస్తోంది.