Begin typing your search above and press return to search.

రెడీ 2 హీటప్: లేడీ 'క్రూ' గ్లామ‌ర్ ట్రీట్

ముఖ్యంగా ఈ పాట ఆద్యంతం ముగ్గురు అంద‌మైన లేడీ క్రూ మెంబ‌ర్స్ గ్లామ‌ర‌స్ ట్రీట్‌తో హీట్ పుట్టిస్తోంది. వీడియో ఆద్యంతం ట‌బు, క‌రీనా, కృతి స‌నోన్ ల గ్లామ‌ర్ విందు క‌న్నుల‌పండుగ చేస్తోంది.

By:  Tupaki Desk   |   5 March 2024 3:39 PM GMT
రెడీ 2 హీటప్: లేడీ క్రూ గ్లామ‌ర్ ట్రీట్
X

ఈ వేసవి మంట‌లు పెట్ట‌డం ఖాయం. మేలో అడుగుపెట్ట‌క ముందే మార్చి ప్రారంభ‌మే మ‌ల మ‌ల మ‌రిగించేస్తోంది. అయితే అంత‌కుమించి హీట్ పెంచేందుకు వ‌స్తున్నారు 'క్రూ' మెంబ‌ర్స్. కరీనా కపూర్ ఖాన్, టబు, కృతి సనన్ త్వరలో విడుద‌ల‌కు రానున్న‌ చిత్రం 'క్రూ'లో కనిపించనున్నారు. ఈ సినిమా ప్ర‌మోష‌నల్ వీడియోల‌తో వెబ్ హీటెక్కుతోంది. 'క్రూ' ఆల్బమ్‌లోని మొదటి పాట నైనాను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలో దిల్జిత్ దోసాంజ్, బాద్షా మెరుపులు మెరిపించారు. స్పెష‌ల్ గ్రూవీ ట్రాక్ ఇప్పుడు వెబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకెళుతోంది.

ముఖ్యంగా ఈ పాట ఆద్యంతం ముగ్గురు అంద‌మైన లేడీ క్రూ మెంబ‌ర్స్ గ్లామ‌ర‌స్ ట్రీట్‌తో హీట్ పుట్టిస్తోంది. వీడియో ఆద్యంతం ట‌బు, క‌రీనా, కృతి స‌నోన్ ల గ్లామ‌ర్ విందు క‌న్నుల‌పండుగ చేస్తోంది. సీనియ‌ర్ న‌టి ట‌బు, నేటి జ‌న‌రేష‌న్ న‌టి కృతిల మ‌ధ్య జ‌న‌రేష‌న్ అయిన క‌రీనా క‌పూర్ ఖాన్ ఆ ఇద్ద‌రినీ డామినేట్ చేస్తూ గ్లామ‌ర‌సం పండించ‌డం ప్ర‌త్యేక చ‌ర్చ‌కు తావిస్తోంది.

ముగ్గురు అందాల భామ‌లు దిల్జిత్‌తో లిప్-సింకింగ్ లో పాట ఆద్యంతం పెర్ఫామ్ చేస్తూ క‌నిపించారు. ఇదే పాటలో బాద్షా ర్యాప్ చేస్తూ కనిపించాడు. కరీనా గ్లామ‌ర్ పాటను మ‌రో లెవ‌ల్ కి చేర్చింద‌ని చెప్పాలి. ''ఈ సంవత్సరంలో అత్యంత అద్భుతమైన ట్రాక్ ఇది.. వేడిని గాడిని పెంచడానికి సిద్ధంగా ఉండండి!'' అనే క్యాప్ష‌న్‌తో దీనిని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది.

ఈ పాట‌లో గ్లామ‌ర్ క్వీన్స్ పైనా అభిమానులు కామెంట్ల‌తో చెల‌రేగుతున్నారు. ఒక అభిమాని ఇలా రాసాడు. ''నేను టబును ఎప్పటికీ గ్లామ్ మూమెంట్‌లో చూడలేదు. ఇప్పుడు చాలా హ్యాపీ'' అని రాసారు. టబు చాలా సిజ్లింగ్ అని ఒక‌రు వ్యాఖ్యానించ‌గా, క‌రీనా అంత‌కుమించి.. కృతి అందాలు చిల్లింగ్ అని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు.

రాజేష్ ఎ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బాలాజీ టెలిఫిల్మ్స్ - అనిల్ కపూర్ ఫిల్మ్ & కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ నిర్మిస్తున్నాయి. 29 మార్చి 2024న థియేటర్లలోకి రానుంది. క్రూ అద్భుతాలు చేయ‌డం ఖాయ‌మ‌ని ఇప్ప‌టికే విడుద‌లైన‌ విజువ‌ల్స్ చెబుతున్నాయి. మ‌ఖ్యంగా ముగ్గురు అంద‌గ‌త్తెల గ్లామ‌ర్ ట్రీట్ జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

విభిన్న వర్గాల నుండి వచ్చిన ముగ్గురు క్యాబిన్ క్రూ అటెండర్ల కథేమిట‌న్న‌ది క్రూ సినిమాలో చూడాలి. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురు మ‌హిళ‌లు కష్టపడి పనిచేసేవారి జీవితాల్లో విధి అనుకోని పరిస్థితులకు దారి తీస్తుంది. ఎయిర్‌పోర్టులో వస్తువులను దొంగిలిస్తూ చిలిపి చేష్ట‌ల‌తో క‌నిపించ‌డం ఆస‌క్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో కపిల్ శర్మ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు.