Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్ : పవర్ అస్త్రతో సందీప్‌ కి షాక్ ఇచ్చిన నాగ్‌

పవర్‌ అస్త్ర ఉన్నంత మాత్రాన ఏ పని చేయను అంటే కుదరదు. అన్ని పనులు చేయాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   11 Sep 2023 3:46 AM GMT
బిగ్‌ బాస్ : పవర్  అస్త్రతో సందీప్‌ కి షాక్ ఇచ్చిన నాగ్‌
X

బిగ్‌ బాస్ సీజన్‌ 7 మొదటి వారం లో పవర్ అస్త్ర కోసం టాస్క్ జరిగింది. శనివారం ఎపిసోడ్‌ లో ఆట సందీప్ కు పవర్ అస్త్ర వచ్చిన విషయం తెల్సిందే. ఆది వారం ఎపిసోడ్‌ లో నాగార్జున పవర్ అస్త్ర యొక్క పవర్స్ గురించి వివరించాడు. ఈ అస్త్ర వల్ల ఇమ్యూనిటీ దక్కడంతో పాటు వీఐపీ రూమ్‌ లోకి వెళ్లే పర్మీషన్ కూడా ఇవ్వడం జరిగింది.

పవర్‌ అస్త్ర ఉన్నంత మాత్రాన ఏ పని చేయను అంటే కుదరదు. అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా అస్త్ర లో ఉన్న బ్యాటరీని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. బ్యాటరీ రెడ్‌ మార్క్ వస్తే డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా గుర్తించుకోవాలి అన్నాడు. వీఐపీ రూమ్‌ లోకి వెళ్లి వచ్చిన సందీప్ ఈ అస్త్ర ను తన కొడుకుక్కి అంకితం ఇస్తున్నట్లుగా పేర్కొన్నాడు.

అప్పుడు నాగార్జున షాక్ ఇచ్చాడు. పవర్ అస్త్ర ను ఎవరికి అయినా ఇచ్చినా, అంకితం చేసినా కూడా దాని పవర్ అంతా పోతుంది అన్నాడు. దాంతో సందీప్‌ షాక్ అయ్యాడు. అయినా పర్వాలేదు అంటూ తన కొడుక్కి అంకితం అంటూ చెప్పడంతో నాగార్జున ఫిదా అయ్యి నిన్ను టెస్ట్‌ చేయడం కోసమే అలా అన్నాను. నీకు పవర్‌ అస్త్ర ఉంటుందని అన్నాడు.

ఆ తర్వాత ఫన్నీ గేమ్స్ ఆడిస్తూ ఎలిమినేషన్‌ పక్రియ చేశాడు. చివర్లో కిరణ్ రాథోడ్‌ మరియు ప్రిన్స్ లు మాత్రమే మిగిలారు. వారిలో కిరణ్ రాథోడ్‌ ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించాడు. ఎలిమినేట్ అయిన కిరణ్ రాథోడ్‌ స్టేజ్ పైకి వెళ్లి కంటెస్టెంట్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పల్లవి ప్రశాంత్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ అంది. రతిక కు అటిట్యూడ్‌ అంది. మొత్తానికి అందరికి ఏదో ఒక క్వాలిటీ ని చెప్పి వెళ్లి పోయింది.