Begin typing your search above and press return to search.

నాగ్ 100.. ఈ దర్శకుడా?

అయితే ఇప్పుడు 100వ సినిమాకు సంబంధించిన అనేక రకాల గాసిప్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. అసలైతే గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలోనే సెంచరీ కొట్టాలని అనుకున్నాడు.

By:  Tupaki Desk   |   9 Oct 2023 10:03 AM GMT
నాగ్ 100.. ఈ దర్శకుడా?
X

అక్కినేని నాగార్జున 100వ సినిమాపై గత కొంతకాలంగా అనేక రకాల వార్తలు వైరల్ గా మారుతున్నాయి. నాగార్జున ఒకేసారి నా సామీ రంగ సినిమాతో పాటు మరొక ప్రాజెక్టును కూడా సెట్స్ పైకి తీసుకురావాలని అనుకున్నాడు. కానీ సరైన స్టోరీ దొరకకపోవడంతో ఇప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా సంక్రాంతికి అయితే నా సామీ రంగ సినిమాతో తప్పకుండా సక్సెస్ అందుకొని 100వ సినిమా కోసం బూస్ట్ పెంచుకోవాలని అనుకుంటున్నారు.

ఎందుకంటే నాగర్జున గత రెండు మూడు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ముఖ్యంగా ది ఘోస్ట్ సినిమా అయితే దారుణంగా డిజాస్టర్ అయింది. అందుకే నాగర్జున తదుపరి సినిమాలపై ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. నా సామీ రంగా సినిమా సంక్రాంతికి రాబోతున్న విషయం తెలిసిందే. విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను నాగార్జున డిసెంబర్ మొదటి వారంలో ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు.

అయితే ఇప్పుడు 100వ సినిమాకు సంబంధించిన అనేక రకాల గాసిప్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. అసలైతే గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలోనే సెంచరీ కొట్టాలని అనుకున్నాడు. కానీ ఆదర్శకుడి కథ మళ్ళీ ఎందుకో ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు మరో తమిళ దర్శకుడు కి సంబంధించిన పేరు అక్కినేని కాంపౌండ్ లో ఎక్కువగా వినిపిస్తోంది.

నవీన్ అనే దర్శకుడు నాగార్జునకు స్టోరీ లైన్ గురించి వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఆదర్శకుడు అంతగా సక్సెస్ ట్రాక్ లో అయితే లేడు. 2013లో మొదట మూడర్ కుడం అనే సినిమా చేశాడు. అదేమీ బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ ఏమీ కాలేదు. తర్వాత 2021లో విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్ లతో అగ్ని సిరగుగల్ అనే మరో సినిమా తీశాడు.

అయితే ఆ సినిమా గత ఏడాదిలోనే విడుదల కావాల్సింది. కానీ ఎందుకో అది చాలా ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ఈ ఏడాది తప్పకుండా విడుదల చేస్తామని అంటున్నారు కానీ ఇప్పటివరకు కరెక్ట్ గా చెప్పడం లేదు. అయితే ఇలాంటి దర్శకుడితో నాగర్జున 100వ సినిమా చేయబోతున్నట్లుగా అక్కినేని కాంపౌండ్ లో టాక్ గట్టిగానే వినిపిస్తోంది. నాగార్జున నవీన్ తో సినిమా చేయబోతున్నాడు అంటే తప్పకుండా కారణం ఏదో బలంగానే ఉండి ఉంటుంది. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.