Begin typing your search above and press return to search.

నాగార్జున ఖాతాలో మ‌రో డెబ్యూ డైరెక్ట‌ర్

కెరీర్ ఆరంభం నుంచి కొత్త ద‌ర్శ‌కుల‌తో ప్ర‌యోగాలు చేయ‌డానికి వెన‌కాడ‌ని హీరోగా కింగ్ నాగార్జున‌కు గొప్ప గుర్తింపు ఉంది.

By:  Tupaki Desk   |   8 Jan 2024 2:45 AM GMT
నాగార్జున ఖాతాలో మ‌రో డెబ్యూ డైరెక్ట‌ర్
X

కెరీర్ ఆరంభం నుంచి కొత్త ద‌ర్శ‌కుల‌తో ప్ర‌యోగాలు చేయ‌డానికి వెన‌కాడ‌ని హీరోగా కింగ్ నాగార్జున‌కు గొప్ప గుర్తింపు ఉంది. శివ సినిమాతో రామ్ గోపాల్ వ‌ర్మ‌ను ప‌రిచ‌యం చేసిన నాగార్జున త‌న కెరీర్ లో ప‌దుల సంఖ్య‌లో కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలిచ్చారు. కొన్నిసార్లు ప్ర‌యోగాలు స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌క‌పోవ‌చ్చు.. కానీ నాగార్జున ప్ర‌య‌త్నానికి ప్ర‌శంస‌లు కురుస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు `నా సామి రంగ` చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాన్ని విజ‌య్ బిన్ని అనే కొరియోగ్రాఫ‌ర్ కి క‌ట్ట‌బెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌చార పోస్ట‌ర్లు స‌హా విజువ‌ల్స్ ప్ర‌తిదీ ఉత్కంఠ‌ను క‌లిగించాయి. జనవరి 14 న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ కథానాయికగా నటించగా, అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజ్ త‌రుణ్ ఒక పాత్ర‌లో న‌టించారు. ఓవైపు నాగార్జున అండ్ టీమ్ రిలీజ్ ప్ర‌మోష‌న్స్ లో ఉండగా కింగ్ గురించిన‌ కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు వైర‌ల్ అవుతున్నాయి.

తాజా స‌మాచారం మేర‌కు.. నాగార్జున తన తదుపరి సినిమా కోసం ఇప్పటికే మరో కొత్త‌ దర్శకుడితో చర్చలు జరుపుతున్నార‌ని తెలిసింది. సుబ్బు అనే యువ దర్శకుడికి ఈసారి అవ‌కాశం ఉంది. అత‌డు నాగార్జునని తన స్క్రిప్ట్‌తో ఇంప్రెస్ చేశాడని, నాగ్ మరికొన్ని మార్పులు అడిగార‌ని వార్తలు వస్తున్నాయి. ఫైనల్ స్క్రిప్ట్ నచ్చితే నాగ్ సినిమాను లాక్ చేసేందుకు ఆస్కారం ఉంద‌ని తెలిసింది. నాగార్జునకు కొత్త ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయ‌డం కొత్త కాదు. చాలా మంది కొత్త దర్శకులను లాంచ్ చేయడం తెలిసిందే.

నాగ్ పాత‌కాల‌పు సౌర‌భం హైలైట్:

నాగార్జునతో నా మొదటి చిత్రానికి దర్శకత్వం వహించడం గౌరవంగా భావించి, ఈ ప్రాజెక్ట్‌కి పని చేయడం చాలా ఆనందంగా ఉంద‌ని `నా సామి రంగ‌` ద‌ర్శ‌కుడు విజ‌య్ బిన్ని తాజా ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించారు. నాగ్ ద‌ర్శ‌క‌త్వానికి అవ‌కాశం క‌ల్పించారు. దర్శకత్వం అంటే నాకు ఎప్పటి నుంచో మక్కువ. కొరియోగ్రఫీ, పాటలు, మాంటేజ్‌ల ద్వారా కథ చెప్పడం ఉంటుంది. దర్శకత్వం చేసే అవకాశం వచ్చినప్పుడు పెద్దగా సవాళ్లు ఎదురుకాకుండానే స్వీకరించాను అని తెలిపారు.

మొదట్లో నాగార్జునతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్న‌పుడు ఆయ‌న‌ ఒక కథను షేర్ చేసారు. ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించమని నన్ను ప్రోత్సహించారు. నా స్టైల్‌కు తగ్గట్టుగా కథను మలచుకున్నాను. నాగార్జునని తన పాతకాలపు సౌరభాన్ని హైలైట్ చేస్తూ ప్రత్యేకమైన లైట్‌లో ప్రెజెంట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను... అని విజ‌య్ బిన్ని తెలిపారు.