Begin typing your search above and press return to search.

క్లాసిక్ హిట్స్ త‌ర్వాత మాస్ కోసం బోస్!

మ‌రి ఈ త్ర‌యానికి గీత ర‌చ‌యిత చంద్ర‌బోస్ కూడా తోడైతే? ఆల్బ‌మ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   14 Nov 2023 6:46 AM GMT
క్లాసిక్ హిట్స్ త‌ర్వాత మాస్ కోసం బోస్!
X

సెంచ‌రీకి ముందే కింగ్ నాగార్జున 99వ చిత్రం 'నా సామిరంగ' ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తోనే సామిరంగ‌డిని ఓ రేంజ్ లో మార్కెట్ లోకి వ‌దిలారు. ప‌క్కా మాస్ కంటెంట్ తో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మ‌ని తొలి పోస్ట‌ర్ తోనే ప్రూవ్ అయింది. కింగ్ నుంచి వ‌స్తోన్న మ‌రో మాస్ మ‌సాలా కంటెంట్ చిత్రం. దీంతో అభిమానుల్లో అంచ‌నాలు పీక్స్ కి చేరాయి. నాగ్ నుంచి మాస్ సినిమా ఎప్పుడా? అని అభిమానులు దాహంతో ఉన్నారు.


ఇప్పుడా దాహం తీరే స‌మ‌యం అస‌న్న‌మైంది. ఇదే సినిమాతో విజ‌య్ బిన్ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ వుతున్నాడు. మ‌రి ఈ మాస్ యాంగిల్ లో కొత్త‌కోణాన్ని ఎలా ఆవిష్క రిస్తాడు? అన్న‌ది తెర‌పై చూడాలి. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూరులో జ‌రుగుతోంది. అక్క‌డ కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ లెజెండ్ కీర‌వాణీ సంగీతం అందిస్తున్నారు. మ‌రి ఈ త్ర‌యానికి గీత ర‌చ‌యిత చంద్ర‌బోస్ కూడా తోడైతే? ఆల్బ‌మ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

ఈ సినిమాకి గీత ర‌చ‌యిత చంద్ర‌బోస్ పాట‌లు ర‌చిస్తున్నారు. దీనికి సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ని చంద్ర‌బోస్ అందించారు. ప్ర‌స్తుతం మైసూర్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్న‌ట్లు బోస్ వెల్ల‌డించారు. 'నా సామిరంగ' పాట‌ల సంద‌డిలో అంటూ ట్విట‌ర్లో నాగార్జున‌..కీర‌వాణితో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేసారు. ఈ త్ర‌యం స‌క్సెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

ఈ కాంబినేష‌న్ లో 'శ్రీరామ‌దాసు'..'షిరిడీ సాయిబాబా' లాంటి భ‌క్తిర‌స చిత్రాల‌తో పాటు 'నేనున్నాను' లాంటి క్లాసిక్ చిత్రం ప్రేక్ష‌కుల్ని అల‌రించాయి. మ్యూజిక‌ల్ గా ఆ సినిమాలు సెన్షేష‌న్ క్రియేట్ చేసాయి. మ‌ళ్లీ ఇంత కాలానాకి ఆ త్ర‌యం చేతులు క‌లిపింది. ఈ గ్యాప్ లో కీర‌వాణి-బోస్ ఎన్నో సంచ‌ల‌నాలు న‌మోదు చేసారనుకోండి. 'నాటు నాటు' పాట‌తో ఏకంగా ఆస్కార్ తెచ్చి దేశం మీసం మెలేసారు.