Begin typing your search above and press return to search.

'ప‌ఠాన్' రేంజ్ లో కింగ్ సినిమా ప్లానింగ్

అలాగే `బ్ర‌హ్మాస్త్ర -2` కూడా ఉంటుందని అన్నారు. అయితే న‌వీన్ ఎవ‌రు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

By:  Tupaki Desk   |   13 Jan 2024 3:30 PM GMT
ప‌ఠాన్ రేంజ్ లో కింగ్ సినిమా ప్లానింగ్
X

గ‌తేడాది షారుక్ ఖాన్ కి `ప‌ఠాన్` ఎలాంటి విజ‌యాన్ని అందించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కిన చిత్రం 1000 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి కింగ్ ఖాన్ ఖాతాలో మ‌రో రికార్డు మూవీగా నిలిచింది. మ‌రి ఇదే రేంజ్ కింగ్ నాగార్జున త‌దుప‌రి సినిమా ప్లాన్ చేస్తున్నారా? `పఠాన్` యాక్ష‌న్ ని మించేలా ఉంటుందా? ఆ రేంజ్ లో కింగ్ అండ్ కో స‌న్నాహాలు చేస్తుందా? అంటే అవున‌నే తెలుస్తోంది.

స్వ‌యంగా ఈ విష‌యాన్ని నాగార్జున నోట రివీల్ చేసారు. త‌న త‌ద‌రుప‌రి సినిమా నవీన్ అనే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్న‌ట్లు ..ఇది భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అని ..ప‌ఠాన్ రేంజ్ లో సినిమా ఉంటుంద‌ని తెలి పారు. ప్ర‌స్తుతం తాను శేఖ‌ర్ కమ్ములా ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న‌ట్లు అది పూర్త‌యిన వెంట‌నే న‌వీన్ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కిస్తున్న‌ట్లు తెలిపారు. అయితే అది 100వ సినిమా అవుతుందా? లేదా? అని లెక్క‌లు మాత్రం వేసుకోలేదు అన్నారు.

అలాగే `బ్ర‌హ్మాస్త్ర -2` కూడా ఉంటుందని అన్నారు. అయితే న‌వీన్ ఎవ‌రు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌వ‌ర‌కూ అత‌ను పేరు ఎక్క‌డా వినిపించ‌లేదు. ఓ కొత్త కుర్రాడితో ఆయ‌న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ప్లాన్ చేస్తున్నారంటే? మ్యాట‌ర్ ఉన్న కుర్రాడ‌నే చెప్పొచ్చు. కొత్త వాళ్ల‌ని ప్రోత్స‌హించ‌డంలో నాగార్జున ఎప్పుడూ ముందుటార‌ని చెప్పాల్సిన ప‌నిలేదు.

తాజా సినిమా నా సామిరంగ కూడా బిజ‌య్ బిన్ని అనే కొత్త కుర్రాడు ద‌ర్శక‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అంత‌కు ముందు ఎంతో మంది కొత్త‌వారితో సినిమాలు చేసారు. అయితే న‌వీన్ తో ఏకంగా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ప్లాన్ చేయ‌డం మాత్రం ఇంట్రెస్టింగ్. ఈ సినిమాని భారీ బ‌డ్జెట్ తో నిర్మించే అవ‌కాశం ఉంది. ఇటీవ‌లి కాలంలో యాక్ష‌న్ సినిమాల బ‌డ్జెట్ లో ఏ రేంజ్ లో ఉంటున్నాయో తెలిసిందే.