Begin typing your search above and press return to search.

ఒకప్పుడు బ్యూటీ.. గుర్తుపట్టలేని విధంగా షాకింగ్ లుక్

నగ్మా లేటెస్ట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చూసిన సినీ ప్రియులు.. ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు.

By:  Tupaki Desk   |   13 Feb 2024 8:18 AM GMT
ఒకప్పుడు బ్యూటీ.. గుర్తుపట్టలేని విధంగా షాకింగ్ లుక్
X

తెలుగు చిత్రసీమలో చాలా మంది హీరోయిన్లు అప్పట్లో ఒక వెలుగు వెలిగి.. ఇప్పుడు తమ ఫ్యామిలీలతో బిజీ అయిపోయారు. కొందరు మాత్రమే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి గెస్ట్ రోల్స్ చేస్తూ మళ్లీ సినీ ప్రియులను అలరిస్తున్నారు. సినిమాలకు గుడ్ బై చెప్పిన అనేక మంది హీరోయిన్లు.. బయట ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. ఎప్పుడో అకేషన్లకు మెరుస్తున్నారు.

లేటెస్ట్ గా ఓ సీనియర్ హీరోయిన్ ను చూసి అంతా షాకవుతున్నారు. అప్పట్లో తమ కలల రాణి ఈమేనా అని డౌట్ పడుతున్నారు. గుర్తుపట్టలేని విధంగా మారిపోయారని కామెంట్లు పెడుతున్నారు. ఆ బ్యూటీ ఎవరో కాదు.. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ వంటి స్టార్ హీరోలతో నటించి సత్తా చాటిన నగ్మా. అటు కేవలం సినిమాల పరంగానే కాకుండా రాజకీయాల్లోనే ఆమె సత్తా చాటింది.

నగ్మా లేటెస్ట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చూసిన సినీ ప్రియులు.. ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. మేడమ్ జీ ఏంటి ఇలా మారిపోయారని ప్రశ్నిస్తున్నారు. చాలా నెలలకు చూశామని చెబుతున్నారు. ఓ పని మీద బయటకొచ్చిన నగ్మాను కొందరు కెమెరాల్లో బంధించి ఆ పిక్స్ ను నెట్టింట ఫుల్ వైరల్ చేశారు. ప్రస్తుతం నగ్మా చాలా లావు అయినట్లు ఆ ఫొటోల్లో కనిపిస్తోంది.

తెలుగులో పెద్దింటల్లుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కాంబోలో తెరకెక్కిన ఘరానా మొగుడుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌ అయింది నగ్మా. 1990 నుంచి 2008 వరకు సినిమాల్లో నటించి మెప్పించింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, భోజ్‌పురి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళనాడులో ఈమెకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు.

ఇప్పటి వరకు పెళ్లి చేసుకోని నగ్మా.. అప్పట్లో కొందరితో ప్రేమాయణం నడిపిందని రూమర్లు వినిపించాయి. ఇక కొన్ని నెలల క్రితం పెళ్లి గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటే పిల్లలు, ఒక తోడు, పెద్ద ఫ్యామిలీ ఉంటుందని చెప్పుకొచ్చింది. కాలం కలిసొస్తే తనకు కూడా పెళ్లి అవుతుందేమో చూడాలని చెప్పింది. అప్పట్లో నగ్మా తన పెళ్లి పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.