Begin typing your search above and press return to search.

నాగార్జున సైలెన్స్ ని భరించలేక పోతున్న ఫ్యాన్స్..!

అసలు నాగ్ సినిమా లేట్ కి రీజన్స్ ఏంటి ఈ విషయాల మీద నాగార్జున నుంచి రెస్పాన్స్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   7 Aug 2023 6:38 AM GMT
నాగార్జున సైలెన్స్ ని భరించలేక పోతున్న ఫ్యాన్స్..!
X

కింగ్ నాగార్జున నెక్స్ట్ సినిమా అప్డేట్ ఏంటి.. వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేసే అక్కినేని హీరో ఇలా సైలెంట్ అయ్యాడేంటి. అసలు నాగ్ సినిమా లేట్ కి రీజన్స్ ఏంటి ఈ విషయాల మీద నాగార్జున నుంచి రెస్పాన్స్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ది ఘోస్ట్ తర్వాత నాగార్జున తన తర్వాత సినిమాను అనౌన్స్ చేయలేదు. కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నా వాటి గురించి కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

రైటర్ ప్రసన్న కుమార్ డైరెక్టర్ గా టర్న్ తీసుకుని నాగార్జునతో సినిమా ప్లానింగ్ లో ఉన్నారని టాక్. అయితే ఆ ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు ముందడుగు పడలేదు. అతనితో పాటుగా నాగార్జున మరో సినిమా కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారట. ఆ మూవీ గురించి కూడా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఒకప్పుడు సినిమా వెంట సినిమా చేస్తూ హడావిడి చేసిన నాగార్జున ఇలా సైలెంట్ అవడం ఆయన ఫ్యాన్స్ ని నిరాశపరుస్తుంది.

హీరో గానే కాదు నిర్మాతగా కూడా అన్నపూర్ణ బ్యానర్ లో సినిమాలు, సీరియల్స్ ని నిర్మించారు నాగార్జున. నిర్మాతగా సినిమాలు తీయడం అటుంచితే హీరోగా కూడా ఆయన చాలా గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్నారు. అయితే నాగ్ సినిమాలు చేయాలని అనుకుంటున్నా సరైన కథలు ఆయనకు దొరకట్లేదని తెలుస్తుంది. ఈమధ్య ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే సరైన కథ లేకపోతే రెండో రోజే థియేటర్ లు ఖాళీ అవుతున్నాయి.

అదీగాక స్టార్ హీరో సినిమా నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ అవుతుండటం వల్ల మంచి కథ దానికి తగిన కథనం ఉంటేనే హీరోలు కూడా రిస్క్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున కూడా తన ప్రాజెక్ట్ ల విషయంలో ఆలస్యం చేస్తున్నారని తెలుస్తుంది. నాగార్జున ప్రసన్న కుమార్ ఈ కాంబో సినిమా త్వరలో మొదలవుతుందని తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.

ఆల్రెడీ సీనియర్ స్టార్ వెంకటేష్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేశారు. నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు సీరీస్ తో వెంకీ అదరగొట్టాడు. అయితే నాగార్జున మనసులో ఓటీటీ ఎంట్రీ కూడా ఉందని తెలుస్తుంది. సరైన కథ దొరికితే తాను కూడా వెబ్ సీరీస్ కు రెడీ అని చెబుతున్నారట. ఎలాగు బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా కూడా నాగార్జున కొనసాగుతున్నారు.

బిగ్ బాస్ సీజన్ 7 త్వరలో మొదలు కాబోతుంది. సో సినిమాల్లో మిస్సైనా రానున్న 3 నెలలు బిగ్ బాస్ తో నాగ్ సందడి చేయనున్నారు.