Begin typing your search above and press return to search.

శ‌రీరం లేదు ఎండిన ర‌క్త‌పు గుర్తులు మాత్ర‌మే!

భార‌త‌మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హ‌త్య నేప‌థ్యంలో ఇప్ప‌టికే కొన్ని సినిమాలొచ్చిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 July 2025 12:33 PM IST
శ‌రీరం లేదు ఎండిన ర‌క్త‌పు గుర్తులు మాత్ర‌మే!
X

భార‌త‌మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హ‌త్య నేప‌థ్యంలో ఇప్ప‌టికే కొన్ని సినిమాలొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా రాజీవ్ హ‌త్య వెబ్ సిరీస్ రూపంలో రెడీ అవుతోంది. అనిరుధ్య మిత్ర ర‌చించిన బెస్ట్ సెల్లింగ్ బుక్ `నైన్టీ డేస్` ఆధారంగా `ది హంట్: ది రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేస్` జాతీయ అవార్డు గ్ర‌హీత నాగేష్ కుకునూర్సా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో హిల్ వైద్, ,భగవతి పెరుమాళ్, డానిష్ ఇక్బాల్ , గిరీష్ శర్మ లాంటి వారు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

విద్యుత్ గార్గ్ష, ఫీక్ ముస్తఫా, అంజనా బాలాజీ, బి. సాయి దినేష్, శ్రుతి జయన్, గౌరీ మీనన్ ఇత‌ర కీలక పాత్రల పోషిస్తున్నారు. అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ - కుకునూర్ మూవీస్ సంయుక్తంగా సిరీస్ ను నిర్మిస్తు న్నాయి. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని జూలై 4న స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. హిందీతో పాటు తెలుగు స‌హా ఇత‌ర భాష‌ల్ల కూడా రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

దీంతో ఈ హ‌త్య కోణాన్ని ఈ సిరీస్ లో ఎలా చూపిస్తున్నారు? కొత్తగా ఏ విష‌యాలు చెప్ప‌బోతున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ కేసుని ఛేదించే క్రమంలో సిట్ కి నాయకత్వం వహించిన కార్తీకేయన్ పాత్ర పోషించిన‌ అమిత్ సియాల్ సిరీస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు పంచుకున్నారు. న‌టు డిగా కార్తికేయ‌న్ లాంటి గొప్ప వ్య‌క్తి పాత్ర‌ను పోషించ‌డం అదృష్టంగా భావిస్తున్నా.

ఈ పాత్ర ఎంతో బాధ్య‌తో పోషించాను. ఈ సిరీస్ రాజ‌కీయ థ్రిల్ల‌ర్ మాత్ర‌మే కాదు నాడు కార్తికేయన్ పేలుడు జరిగిన ప్రదేశాన్ని సందర్శించే క్షణంలో అక్కడ శరీరం కనిపించ లేదు. ఎండిన రక్తం గుర్తులు మాత్రమే ఉన్నాయి. క‌డ‌సారి చూపు కూడా లేకుండా ఒక విలువైన వ్య‌క్తిని కోల్పోవ‌డం హృద‌యాన్ని ఎంత గానో క‌ద‌లించింద‌న్నారు. రాజీవ్ గాంధీ మాన‌వ బాంబు చేతిలో ఎలా హ‌త‌మ‌య్యారు? అన్న ఆధారంగా మ‌ల‌యాళంలో ఓ సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే.