Begin typing your search above and press return to search.

ఇద్దరు యంగ్ హీరోలకు లైఫ్ ఇస్తున్న నాగ్..?

అయితే, ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆ న్యూస్ ప్రకారం, ఈ మూవీలో ఇద్దరు యంగ్ హీరోలకు నాగ్ అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   19 Sep 2023 11:30 PM GMT
ఇద్దరు యంగ్ హీరోలకు లైఫ్ ఇస్తున్న నాగ్..?
X

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం నా సామిరంగ. ఈ మూవీలో నాగ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు. గత కొంతకాలంగా ఫెయిల్యూర్లతో బాధపడుతున్న నాగ్, ఈ మూవీతో మళ్లీ ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ కొడుతుందని మూవీ టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.

అయితే, ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆ న్యూస్ ప్రకారం, ఈ మూవీలో ఇద్దరు యంగ్ హీరోలకు నాగ్ అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. హిట్లు లేక ఇబ్బందులకు పడుతున్న ఇద్దరు హీరోలు ఈ మూవీలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. వారెవరో కాదు అల్లరి నరేష్, మరో హీరో రాజ్ తరుణ్.

రాజ్ తరుణ్ మొదట్లో యూట్యూబర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టగా, అతనిని హీరో చేసింది నాగార్జునే. రాజ్ తరుణ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఉయ్యాల, జంపాల సినిమా కి నాగార్జునే నిర్మాత. అప్పుడు అలా ఛాన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన నాగ్, ఇప్పుడు మరోసారి తన సినిమాలో ఛాన్స్ ఇస్తుండటం విశేషం. ఈ మూవీలో మంచి రోల్ పడితే, రాజ్ తరుణ్ మళ్లీ లైన్ లోకి వచ్చే అవకాశం ఉంది.

ఇక, ఒకప్పుడు కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్, తర్వాత తన జోనర్ మార్చుకున్నారు. మహర్షి సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించిన నరేష్ ఆసినిమా తరువాత సీరియస్ క్యారెక్టర్లవైపు దృష్టి పెట్టాడు. నాంది సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌కు నాంది పలికి సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. రీసెంట్‌గా తాను చేసిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.

ఇప్పుడు నాగ్ సినిమాలోనూ అల్లరి నరేష్ కి మంచి రోల్ దక్కినట్లు తెలుస్తోంది. దర్శక, నిర్మాతలు అల్లరి నరేశ్‌ని సంప్రదించగానే ఆయన వెంటనే ఒకే చెప్పారట. మామూలుగానే నరేష్, నాగ్ కి వీరాభిమాని. ఇక ఆయనతో నటించే ఆఫర్ వస్తే ఎలా వదులుకుంటాడు. వెంటనే ఒకే చెప్పేశాడట. ఇక ఈ సినిమాకి సంగీతం కీరవాణి అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ సంభాషణలు అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. మరి, ఈ మూవీ ఈ ఇద్దరు యంగ్ హీరోలకు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.