Begin typing your search above and press return to search.

తండేల్ వరల్డ్.. అల్లు అరవింద్ సూపర్ స్పీచ్..!

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న సినిమా తండేల్

By:  Tupaki Desk   |   9 Dec 2023 11:44 AM GMT
తండేల్ వరల్డ్.. అల్లు అరవింద్ సూపర్ స్పీచ్..!
X

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న సినిమా తండేల్. నేడు పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా పూజా కార్యక్రమం అనంతరం మీడియాతో చిత్ర యూనిట్ ముచ్చటించారు. డైరెక్టర్ చందు మొండేటి మాట్లాడుతూ అరవింద్ గారు చెప్పినట్టుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కథ మీద కూర్చున్నాం. వాసు గారు అల్లు అరవింద్ గారు వాళ్లు ఏదైతే ఎంకరేజ్ చేస్తారో బయటకు వెళ్లాలని అనిపించదు. ఈ సినిమాకు హీరో, హీరోయిన్, టెక్నికల్ టీం అంతా బెస్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇక బ్యాలెన్స్ ఉంది నేనే.. నేను కూడా మీతో కలిసి నా బెస్ట్ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నానని చందు మొండేటి అన్నారు.

ఇక సినిమా గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఏడాదిన్నరగా మొదలైన ప్రయత్నం ఈ రోజు పూజ వరకు వచ్చింది. ఈమధ్య కాలంలో ఒక సబ్జెక్ట్ మీద దాన్ని చెక్కి ఎలా తీర్చిదిద్దాలా అన్నది డైరెక్టర్ హీరో చాలా పేషెన్స్ తో చేస్తున్నారు. ఎప్పుడు షూటింగ్ అన్నది కాకుండా మనం అనుకున్న విధంగా ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్లాలని చూస్తున్నామని అన్నారు.

ఒక సినిమా హిట్ పడగానే వెంటనే అవకాశాలు వస్తాయి. ఎంతమంది ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఆ కథను పట్టుకుని ఆ కథకు నాగ చైతన్య సూట్ అవుతారని అనుకుని అతన్ని ఒప్పించి అలా ఈ సినిమా ప్రయాణం మొదలైందని అన్నారు. ఈమధ్య సినిమాలు చాలా పెద్దదిగా చూడటం అలవాటు అయ్యింది. ఇతర భాషల్లోకి కూడా తీసుకెళ్లాలి. అందుకు మంచి టీం దొరకడం చాలా పాజిటివ్ గా ఉందని అన్నారు అల్లు అరవింద్.

సినిమా యూనిట్ అంతా నా బోర్డ్ రూం లో కూర్చుని సినిమా ఎలా తీయాలా అని చాలా పద్దతిగా ఆలోచించి చేస్తున్నారు. దీన్నంతా నడిపిస్తున్న కెప్టెన్ డైరెక్టర్ చందు ఈ సినిమా బాగా తీస్తారని నమ్ముతున్నా.. తండేల్ అంటే ఏంటని సందేహం ఉంది. అది అలానే ఉంచండి దాని గురించి మాట్లాడుతూ ఉండండని అన్నారు అల్లు అరవింద్.