Begin typing your search above and press return to search.

'తండేల్' ఒక రేంజ్ అంటున్నారు!

అక్కినేని నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా తండేల్

By:  Tupaki Desk   |   9 Dec 2023 11:40 AM GMT
తండేల్ ఒక రేంజ్ అంటున్నారు!
X

అక్కినేని నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా తండేల్. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా పూజా కార్యక్రమాలు నేడు నిర్వహించారు. విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున అతిథులుగా పూజా కార్యక్రమం జరిగింది. పూజ అనంతరం తండేల్ టీం మీడియాతో ముచ్చటించారు.


తండేల్ హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి స్క్రిప్ట్ మీద ట్రావెల్ అవుతూ వస్తున్నాం. ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లోనే చాలా బాగా ఎంజాయ్ చేశాను.. మంచి కొలాబరేషన్ గా వర్క్ జరిగింది. ఫస్ట్ శ్రీకాకుళం వెళ్లి అక్కడ ఫ్యామిలీస్ తో ఇంటరాక్ట్ అవ్వడం.. ఆ తర్వాత చందుతో కలిసి శ్రీకాకుళం స్లాంగ్ మీద వర్క్ అవుట్ చేశాం. తను నటించిన ఏ సినిమాకు ఇంత ప్లానింగ్ తో వెళ్లలేదు. ఈ ప్రాసెస్ అంతా ఎంజాయ్ చేశాను.


అల్లు అరవింద్ గారు ఇది అన్ని సినిమాల్లా కాదు సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. తొదరపడకుండా ప్రాపర్ ప్లానింగ్ తో వెళ్దామని అన్నారు. పొటెన్షన్ ఉన్న స్క్రిప్ట్ వర్క్ చేస్తే బాగా వస్తుందని అన్నారు. తనపై నమ్మకం ఉంచి కాంబినేషన్ కాకుండా కథ మీద నమ్మకంతో ఇంత బడ్జెట్ ఇస్తున్నందుకు అల్లు అరవింద్ గారికి థాంక్స్ అని అన్నారు. 100% లవ్ తో కెరీర్ లో మెమరబుల్ హిట్ ఇచ్చారు. చందు డైరెక్టర్ కన్నా మంచి ఫ్రెండ్ అని అన్నారు నాగ చైతన్య. సాయి పల్లవి మంచి ఎంకరేజింగ్ యాంకర్.


లవ్ స్టోరీలో పర్ఫార్మెన్స్ అంత బాగా వచ్చింది అంటే నా ముందు యాక్టర్స్ బాగా చేయడం వల్లే అందుకే ఆ సినిమాలో తనకు వచ్చిన క్రెడిట్ లో సగం సాయి పల్లవికి ఇస్తానని అన్నారు నాగ చైతన్య. దేవి తో చాలా రోజుల తర్వాత పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. డిసెంబర్ 15 తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తామని అన్నారు నాగ చైతన్య.


ఇదే ఈవెంట్ లో సాయి పల్లవి మాట్లాడుతూ సినిమా ముహూర్తం రోజే చాలా పాజిటివిటీ కనిపిస్తుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఈ సినిమాకు ఒక విజన్ ఆలోచిస్తున్నారు. అది అలానే ఆడియన్స్ కు రీచ్ అవ్వాలని అనుకుంటున్నా అని అన్నారు సాయి పల్లవి.