Begin typing your search above and press return to search.

నాగ్ సెంచరీ సస్పెన్స్.. డిసైడ్ చేసేది ఎవరు!

ఇక ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా ఈ సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని చెప్పకనే చెబుతోంది.

By:  Tupaki Desk   |   5 Dec 2023 1:30 AM GMT
నాగ్ సెంచరీ సస్పెన్స్.. డిసైడ్ చేసేది ఎవరు!
X

నాగార్జున ఈసారి సంక్రాంతిని సెంటిమెంట్ గా భావించి నా సామి రంగ అనే సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు వంటి విలేజ్ మాస్ సినిమాలతో మంచి సక్సెస్ సొంతం చేసుకున్న నాగార్జున ఈసారి కూడా అదే ఫార్మాట్లో సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని ధీమాతో కనిపిస్తూ ఉన్నాడు.

ఇక ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా ఈ సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని చెప్పకనే చెబుతోంది. ఇక రీసెంట్ గా హీరోయిన్ ఆశికా రంగనాథ్ ఫస్ట్ లుక్ కూడా ఒక సాంగ్ ప్రోమో ద్వారా విడుదల చేశారు. మొత్తానికి ఈ సినిమా సంక్రాంతి టైంలో మాత్రం మంచి బజ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.

అయితే మరోవైపు నాగార్జున సెంచరీ సినిమాపై కొంత సస్పెన్స్ ఐతే కొనసాగుతోంది. ప్రస్తుతం నా సామి రంగ సినిమా 99వ చిత్రంగా రూపొందుతోంది. ఇక నాగార్జున నెక్స్ట్ సినిమా ఏంటి అనే విషయంలో మాత్రం సరైన క్లారిటీ రాలేదు. అఫీషియల్ గా అయితే శేఖర్ కమ్ముల ధనుష్ సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ధనుష్ మెయిన్ హీరో కాబట్టి ఇది 100వ సినిమా కాకుండా ఉండేలా నాగ్ జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే మరొకవైపు తమిళ దర్శకుడు అనిల్ తో కూడా నాగ్ ఒక సినిమా చేయబోతున్నట్లుగా టాక్ వచ్చింది. కోలీవుడ్ నిర్మాత జ్ఞాన్ వెల్ రాజ నిర్మాణంలో వీరి సినిమా వచ్చే అవకాశం ఉంది. నాగ్ అయితే పూర్తి కథపై ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.

కానీ వీలైనంత త్వరగా ధనుష్ కమ్ముక సినిమా కాంటె ముందే ఆ సినిమా రావాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు దర్శకుడు అనిల్ తో కూడా చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఒకవేళ స్క్రిప్ట్ వెంటనే లాక్ అయితే సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అసలైతే నాగ్ తన 100వ సినిమాను మోహన్ రాజా దర్శకత్వంలో చేయాలని అనుకున్నాడు. కానీ అతను డైరెక్ట్ చేసిన గాడ్ ఫాదర్ అంతగా క్లిక్ కాకపోవడంతో నాగ్ వెనుకడుగు వేశాడు. మరి అనిల్ ప్రాజెక్టు అయినా తొందరగా పట్టాలు ఎక్కుతుందో లేదో చూడాలి.