Begin typing your search above and press return to search.

నాగార్జున మాల్దీవుల ప‌ర్య‌ట‌న ర‌ద్దు

అయితే తాజా స‌మాచారం మేర‌కు ఈనెల 17న మాల్దీవులకు వెకేష‌న్ కోసం వెళ్లాల్సి ఉండ‌గా, నాగార్జున ఈ ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకున్నార‌ని తెలిసింది.

By:  Tupaki Desk   |   13 Jan 2024 5:00 AM GMT
నాగార్జున మాల్దీవుల ప‌ర్య‌ట‌న ర‌ద్దు
X

కింగ్ నాగార్జున తాజా చిత్రం 'నా సామి రంగ' సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం టీజ‌ర్, ట్రైల‌ర్ల‌తో అంద‌రి దృష్టిని ఆకర్షించింది. నూతన దర్శకుడు విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగార్జున దూకుడుగా ప్రమోట్ చేస్తున్నాడు. అయితే తాజా స‌మాచారం మేర‌కు ఈనెల 17న మాల్దీవులకు వెకేష‌న్ కోసం వెళ్లాల్సి ఉండ‌గా, నాగార్జున ఈ ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకున్నార‌ని తెలిసింది. మాల్దీవుల మంత్రుల అసంబ‌ద్ధ వ్యాఖ్య‌ల‌తో ఇండియా సీరియ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ల‌క్ష్య‌ద్వీప్‌(కేర‌ళ స‌మీప దీవులు)ని ప్ర‌మోట్ చేసారు. అనంత‌రం ఈ సీజ‌న్ లో మాల్దీవుల వెకేష‌న్ కోసం టికెట్లు బుక్ చేసుకున్న సెల‌బ్రిటీలంతా త‌మ ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కింగ్ నాగార్జున కూడా మాల్దీవుల విహార యాత్ర‌ను ర‌ద్దు చేసుకున్నారు. బిగ్ బాస్, నా సామి రంగా చిత్రాల‌తో బిజీగా ఉన్న నాగ్ విశ్రాంతి కోసం మాల్దీవులు వెళ్లాల‌నుకున్నా ఇంత‌లోనే ప‌రిణామాలు ఇలా మారిపోయాయి.

క‌మ్ముల‌తో స్టార్ట్:

తాజా స‌మాచారం మేర‌కు.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున తన కొత్త సినిమా షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో తమిళ స్టార్ ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ధనుష్‌తో కలిసి నటించే చిత్రాన్ని ఈ నెల 25న ప్రారంభిస్తానని ప్రకటించారు. ధ‌నుష్ చిత్రంలో నాగార్జున చాలా యూనిక్ రోల్‌లో కనిపించనున్నార‌ని తెలుస్తోంది.

నాగ్ సంక్రాంతికి వ‌స్తున్న సినిమాల‌న్నీ విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు. నా సామి రంగ ప్రచార కార్యక్రమంలో తన స‌హ‌చ‌ర హీరోలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో 75 సినిమాలు పూర్తి చేసిన వెంకటేష్ సైంధ‌వ్, టాలీవుడ్‌లో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న మహేష్ బాబు 'గుంటూరు కారం', న‌వ‌త‌రం హీరో తేజ స‌జ్జా న‌టించిన హ‌నుమాన్ విజ‌యం సాధించాల‌ని నాగ్ ఆకాంక్షించారు.

గతంలో సంక్రాంతి సీజన్‌లో తాను విజయాన్ని చవిచూశానని, 'నా సామి రంగ'తో ఆ మ్యాజిక్‌ను పునరావృతం చేస్తాన‌ని పేర్కొన్నాడు. ప్రేక్ష‌కుల‌కు సినిమా నచ్చితే తప్పకుండా విజేతగా నిలబెడ‌తార‌ని ప్ర‌శంసించారు. ఇంతకుముందు రెండు సార్లు సంక్రాంతి బ‌రిలో విజయాలు అందుకున్నానని నాగార్జున అన్నారు. ఈసారి కూడా వారి ఆదరణను కొనసాగించాలని కోరుకుంటున్నాను అని అభిప్రాయపడ్డారు. నా సామి రంగలో లుంగీ అవతార్‌లో నాగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తున్నారు. మునుప‌టి గ్రామీణ ఆధారిత సినిమాలు సోగ్గాడే చిన్ని నాయనా-బంగార్రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వ‌ద్ద ఆక‌ట్టుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే టాలీవుడ్‌కి కూడా పండగే అని నాగార్జున అన్నారు. భోగి రోజ‌న అంటే జ‌న‌వ‌రి 14న నా సామి రంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది.