Begin typing your search above and press return to search.

పవన్ కోసం ప్రచారంలో టాప్ ప్రొడ్యూసర్.. ఎంత బిజీగా ఉన్నా..

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అన్నయ్య చిరంజీవి కూడా తన సపోర్ట్ ను తెలియజేసిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 May 2024 6:16 AM GMT
పవన్ కోసం ప్రచారంలో టాప్ ప్రొడ్యూసర్.. ఎంత బిజీగా ఉన్నా..
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలి అని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అన్నయ్య చిరంజీవి కూడా తన సపోర్ట్ ను తెలియజేసిన విషయం తెలిసిందే.


అలాగే యువ హీరోలు కూడా డైరెక్ట్ గా ప్రచారంలోకి దిగుతున్నారు. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇప్పటికే ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే మరి కొంతమంది యువ హీరోలు సైతం పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురంలో విజయం సాధించాలి అని సోషల్ మీడియా ద్వారా వారి విషెస్ అందిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని, హీరో రాజ్ తరుణ్ అలాగే మరి కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ప్రచారాలు నిర్వహిస్తూ జనసేననికి మద్దతును అందిస్తున్నారు.


ఇక ప్రముఖ నిర్మాత నాగవంశీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేయడం విశేషం. జనసేన కండువా కప్పుకున్న నాగవంశం ప్రత్యేకంగా జనాలను కలుస్తూ పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. జనాలను కలుస్తూ పవన్ మంచితనం గురించి వివరించారు.

నిర్మాత నాగవంశీ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. అలాగే వారి అనుబంధ సంస్థ హారిక హాసిని ప్రొడక్షన్లో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా చేశారు. ఆ సినిమాతో చాలా నష్టపోవడంతో పవన్ కళ్యాణ్ కొంత రెమ్యునరేషన్ కూడా తగ్గించాడు. ఆ విషయాన్ని గతంలోనే ఈ నిర్మాత తెలియజేశాడు. పవన్ కళ్యాణ్ మంచితనం గురించి తెలిసిన చాలామంది సినీ ప్రముఖులు ఆయన గెలిచి అసెంబ్లీ లోకి అడుగు పెట్టాలి అని కోరుకుంటూ ఉన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ తో తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని సినిమాలో చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా నిర్మాత నాగవంశీ తెలియజేశారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ పవర్ స్టార్ విజయం కోసం ప్రచారాల్లో పాల్గొనడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల అనంతరం కొన్ని రోజుల తర్వాత సినిమా షూటింగ్స్ లలో పాల్గొనే అవకాశం ఉంది. ఆయన ఇదివరకే మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమాతో పాటు OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల బ్యాలెన్స్ షూటింగ్స్ పూర్తి చేయనున్నాడు. ఇక వీటిలో ముందుగా OG సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.