అఖిల్6 పై నాగవంశీ ట్వీట్
ఏజెంట్ తర్వాత అఖిల్ ఇప్పటివరకు మరో సినిమాను అనౌన్స్ చేసింది లేదు. ఇదిగో అనౌన్స్‌మెంట్, అదిగో అనౌన్స్‌మెంట్ అంటున్నారు తప్పించి ఇప్పటివరకు అనౌన్స్ మాత్రం చేయలేదు.
By: Tupaki Desk | 5 April 2025 1:24 PMఎంత కష్టపడినా, ఎన్ని ఛాన్సులు తీసుకున్నా అఖిల్ అక్కినేనికి బ్లాక్ బస్టర్ మాత్రం అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. అఖిల్ లాంటి హీరోకి సరైన మాస్ కంటెంట్ పడితే ఈ పాటికి స్టార్ హీరోల లిస్ట్ లో చేరేవాడు. కానీ ఇప్పటివరకు అఖిల్ చేసిన సినిమాలన్నీ అతన్ని నిరాశపరిచినవే. అఖిల్ మూవీ కోసం వినాయక్ తో కలిసి మాస్ ట్రై చేసిన అఖిల్ ఆ సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు.
ఆ తర్వాత రెండో మూవీగా హలో తీస్తే అది కూడా ఆడలేదు. తర్వాత మిస్టర్ మజ్నుగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు కానీ అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ఓ మోస్తరు హిట్ అందుకున్న అఖిల్, సురేందర్ రెడ్డి తో కలిసి ఏజెంట్ చేశాడు. ఆ సినిమా కోసం అఖిల్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. కానీ ఏజెంట్ అందరికీ నిరాశే మిగిల్చింది.
దీంతో అఖిల్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టే కనిపిస్తానని స్వయంగా నాగార్జునతో చెప్పగా, నాగార్జున ఆ విషయాన్ని మీడియాతో, ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. ఏజెంట్ తర్వాత అఖిల్ ఇప్పటివరకు మరో సినిమాను అనౌన్స్ చేసింది లేదు. ఇదిగో అనౌన్స్‌మెంట్, అదిగో అనౌన్స్‌మెంట్ అంటున్నారు తప్పించి ఇప్పటివరకు అనౌన్స్ మాత్రం చేయలేదు.
ఈ నేపథ్యంలోనే అఖిల్ 6వ సినిమా అనౌన్స్‌మెంట్ ఏప్రిల్ 8వ తేదీన అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా రానున్నట్టు సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశాడు. అఖిల్6 సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నట్టు తెలుస్తోంది. వినరో భాగ్యము విష్ణు కథ డైరెక్టర్ మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్6 తెరకెక్కనున్నట్టు సమాచారం.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా లవ్ స్టోరీ గా రూపొందనుందని అంటున్నారు. ఆల్రెడీ సినిమా మొదలైందని, షూటింగ్ కూడా జరుగుతుందని సమాచారం. ఈ సినిమాకు లెనిన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు టాక్. ఆల్మోస్ట్ ఇదే టైటిల్ ఫిక్స్ చేసే ఛాన్సుందంటున్నారు. ఏప్రిల్ 8వ తేదీన సినిమాను అనౌన్స్ చేస్తూ దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్ చేసే అవకాశముంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత అఖిల్ సినిమాను అనౌన్స్ చేస్తున్నందుకు అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.