లెనిన్ సక్సెస్ వెనక నాగార్జున హస్తం ఉందా.. నిజాలు బయటపెట్టిన నాగ వంశీ!
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది.
By: Madhu Reddy | 12 July 2026 12:10 AM ISTఅక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సినిమా సంచలన విజయంపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అఖిల్ విజయాన్ని చూసి కింగ్ నాగార్జున గారు ఎంతలా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారో చెబుతూ.. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అనడానికి ఇంతకంటే పెద్ద సర్టిఫికేట్ ఏమీ అక్కర్లేదని నాగవంశీ పేర్కొన్నారు.
నాగార్జున గారిని ఎప్పుడూ అలా చూడలేదు:
నాగవంశీ మాట్లాడుతూ.. "ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డాడు, తన రక్తాన్ని చెమటను ధారపోశాడు. కొడుకు సాధించిన ఈ భారీ విజయాన్ని చూసి నాగార్జున గారు ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇక ఇన్ని సంవత్సరాల్లో నాగార్జున గారిని నేను ఎప్పుడూ అలా చూడలేదు. ఒక తండ్రిగా ఆయన కళ్లలో కనిపించిన ఆనందం కన్నీళ్లే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనేదానికి అసలైన వాలిడేషన్" అని ఎమోషనల్ గా చెప్పారు.
నాకంటే ఎక్కువ సార్లు మా ఆఫీస్‌కు వచ్చారు:
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో నాగార్జున గారి డెడికేషన్ గురించి నాగవంశీ ఒక క్రేజీ సీక్రెట్ చెప్పారు. "మా ఎడిటర్ తన కంఫర్ట్ కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆఫీస్‌లోనే ఎడిటింగ్ చేస్తానన్నాడు. నాగార్జున గారి రేంజ్‌కు 'అన్నపూర్ణకు రమ్మను' అని ఒక్క మాట చెప్తే అందరం నోరుమూసుకుని వెళ్తాం. కానీ ఆయన ఎవరినీ డిస్టర్బ్ చేయలేదు. ఇక రిలీజ్‌కు 15, 20 రోజుల ముందు నుంచి నాకంటే ఎక్కువ సార్లు నాగార్జున గారే మా సితార ఆఫీస్‌కు వచ్చి ఎడిటింగ్ దగ్గరుండి చూసుకున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్టూడియోకి స్వయంగా వెళ్లి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతా చెక్ చేశారు."
నైజాం, యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఊహించని ర్యాంపేజ్:
కలెక్షన్ల విషయానికొస్తే 'లెనిన్' నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ చూపిస్తోంది. "నిన్న నైజాంలో మార్నింగ్, మ్యాట్నీ, ఫస్ట్ షో.. ఈ మూడు షోల గ్రాస్ ఎంత ఉందో, కేవలం ఒక్క సెకండ్ షో గ్రాస్ దానికి సమానంగా వచ్చింది. ఇక రాత్రి 12:40కి ఈ లెక్కలు చూసి తట్టుకోలేక వెంటనే అఖిల్‌కు ఫోన్ చేసి చెప్పాను. యూఎస్ ఆడియన్స్ కూడా ఈ మాస్ సినిమాకు నేను ఊహించిన దానికంటే బెటర్ గా రియాక్ట్ అయ్యారు. రాయలసీమలో అయితే గంటగంటకు బుక్ మై షోలో టికెట్ల కోసం పెద్ద యుద్ధమే జరిగింది" అని వంశీ హర్షం వ్యక్తం చేశారు.
సంక్రాంతి రేంజ్‌లో థియేటర్ల కోసం గొడవలు: గత మూడు నాలుగు నెలలుగా థియేటర్లకు జనాలు రావడం లేదనే బాధ ఉండేదని, కానీ 'లెనిన్' ఆ పరిస్థితిని మార్చేసిందని నాగవంశీ అన్నారు. "నిన్న సాయంత్రం తిరుపతి టౌన్‌లో ఉన్న 9 థియేటర్లలోనూ షోలు ఫుల్ అయ్యాయి. ఇవాళ మదనపల్లి లాంటి స్టేషన్లలో కూడా మార్నింగ్ షోలకే 4 థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. ఇక మా గుంటూరు డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడూ ఏడుపు మొహం పెడతాడు, వాడు కూడా ఫోన్ చేసి 'అన్నీ ఫుల్స్ సార్' అని హ్యాపీగా నవ్వాడు. మామూలుగా సంక్రాంతి టైమ్‌లో స్క్రీన్స్ యాడ్ చేయమని గొడవ పడతాం, కానీ ఇవాళ ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్లు స్క్రీన్స్ పెంచమని అడుగుతున్నారు. నిజమైన బ్లాక్‌బస్టర్ అంటే ఏంటో ఈ రెవెన్యూనే చెబుతోంది."
సూర్యదేవర నాగవంశీ స్పీచ్‌తో 'లెనిన్' సినిమా కలెక్షన్ల రేంజ్ ఏంటో ట్రేడ్ వర్గాలకు పక్కా క్లారిటీ వచ్చేసింది. నాగార్జున లాంటి పెద్ద మనుషులు ఎక్కడా ఎవరికీ డిస్కంఫర్ట్ కలగకుండా టెక్నీషియన్లకు ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే ఇవాళ ఇంతటి అద్భుతమైన విజయం దక్కిందని నాగవంశీ ముగించారు. అఖిల్ కెరీర్‌లోనే ఇదొక మైండ్‌బ్లోయింగ్ హిట్‌గా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
