Begin typing your search above and press return to search.

ఆ ఎడిపించే సినిమా ఎందుకు చూడాలి?

ఈ సందర్భంగా సప్తసాగరాలు దాటి సైడ్- బి సినిమా చూశారా? అని అడిగితే, తను అలాంటి సినిమాలు చూసే చాన్సే లేదని తేల్చేశాడు.

By:  Tupaki Desk   |   26 Nov 2023 7:56 AM GMT
ఆ ఎడిపించే సినిమా ఎందుకు చూడాలి?
X

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత, యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ ఈ మధ్య బాగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన ఏ ప్రెస్ మీట్ లో మాట్లాడినా అది కాస్త హాట్ టాపిక్ అవుతుంది. కొన్నిసార్లు ఆయన చేసే వ్యాఖ్యలు వివాదాలకు దారి తీస్తున్నాయి. ఆ మధ్య హాలీవుడ్ ఫిలిం 'అవతార్ 2' పై నాగ వంశీ చేసిన విమర్శలు ఏ రేంజ్ లో చర్చనీయాంశమయ్యాయో తెలిసిందే.

రీసెంట్ టైమ్స్ లో తాను నిర్మించిన 'మ్యాడ్' మూవీ గురించి మాట్లాడుతూ జాతి రత్నాలు కంటే ఈ సినిమాలో ఎక్కువ కామెడీ ఉంటుందని, ఈ సినిమా చూశాక ఆ ఫీలింగ్ కరగకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తానంటూ చెప్పడం సోషల్ మీడియా అంతటా వైరల్ అయింది. కట్ చేస్తే తాజాగా 'సప్త సాగరాలు దాటి' సినిమాపై నాగవంశీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

నాగ వంశీ తాజాగా ఓ వెబ్ పోర్టల్ చర్చా వేదికలో కలర్స్ స్వాతి, శోభు యార్లగడ్డ, ప్రియదర్శి తదితరులతో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సప్తసాగరాలు దాటి సైడ్- బి సినిమా చూశారా? అని అడిగితే, తను అలాంటి సినిమాలు చూసే చాన్సే లేదని తేల్చేశాడు. ఆల్రెడీ లైఫ్ లో ఉన్న డిప్రెషన్స్ చాలని, మళ్లీ సినిమా చూసి డిప్రెషన్ తెచ్చుకోవాల్సిన పనిలేదని ఈ సందర్భంగా నాగ వంశీ కామెంట్స్ చేశాడు.

అంతేకాదు డబ్బులు ఇచ్చి మరీ థియేటర్స్ కి వెళ్లి ఏడవాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు. దాంతో కలర్స్ స్వాతి, ఇలాంటి సినిమాలు చూస్తే ఒక కొత్త కోణం తెలుస్తుంది కదా అని చెప్పగా.. నాగవంశీ మాత్రం ఇలాంటి సినిమాలు అసలు చూడనని తేల్చి చెప్పాడు. ఇదే చర్చలో భాగంగా బాగున్న సినిమాలు ఆడతాయి, బాలేని సినిమాలు ఆడవని మిగతా వాళ్ళు మాట్లాడగా..

తన సినిమా మంత్ ఆఫ్ మధు సరిగ్గా ఆడలేదు అంటే అది బాలేదని అర్థమా? అని స్వాతి ప్రశ్నించగా.. ఆ సమయంలో ఐదు సినిమాలతో పోటీ ఉండడం ప్రభావం చూపి ఉండొచ్చని నిర్మాత నాగవంశీ అన్నాడు. దీంతో నాగ వంశీ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా సప్త సాగరాలు దాటి సినిమాపై ఈ నిర్మాత చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.