Begin typing your search above and press return to search.

'మ్యాడ్' ప్లాన్.. ఈ రిస్క్ తీసుకంటేనే కలెక్షన్స్!

ఇప్పటికే నిర్మాత నాగ వంశీ సినిమా చూసి నవ్వకపోతే టికెట్ డబ్బులు కూడా వెనక్కి ఇస్తాను అని ఛాలెంజ్ చేయడం వైరల్ అయింది.

By:  Tupaki Desk   |   3 Oct 2023 4:45 PM GMT
మ్యాడ్ ప్లాన్.. ఈ రిస్క్ తీసుకంటేనే కలెక్షన్స్!
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అడ్వాన్స్ ప్రీమియర్స్ అనే కొత్త ట్రెండు నడుస్తుంది. సినిమా కంటెంట్ మీద నమ్మకంతో చెప్పిన డేట్ కంటే ముందుగానే విడుదల చేస్తున్నాము అంటూ నిర్మాతలు ధైర్యంగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా ఈ సవాలు కొన్ని సినిమాలకు చాలా హెల్ప్ అవుతుంటే మరికొన్ని సినిమాలను దారుణంగా దెబ్బ కొడుతున్నాయి.

ఆ మధ్య వచ్చిన సామజవరగమన ఈ రూట్లో వచ్చి మంచి సక్సెస్ అందుకోగా.. రీసెంట్గా వచ్చిన పెదకాపు మాత్రం గట్టి దెబ్బ కొట్టింది. సక్సెస్ అయితే బిగ్ హిట్టు. లేదంటే భారీ దెబ్బ అనే విధంగా అడ్వాన్స్ ప్రీమియర్ సూచిస్తుంది. ఇక ఈ రిస్క్ తీసుకోవడం కొన్ని సినిమాలకు అయితే తప్పనిసరిగా మారింది. ఇప్పుడు హారిక హాసిని అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ లో వస్తున్న మ్యాడ్ సినిమా కూడా ముందుగానే కొన్ని ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది.

ఇప్పటికే నిర్మాత నాగ వంశీ సినిమా చూసి నవ్వకపోతే టికెట్ డబ్బులు కూడా వెనక్కి ఇస్తాను అని ఛాలెంజ్ చేయడం వైరల్ అయింది. ఇక ఆయన సినిమా మీద ఎంతో నమ్మకంతో అయితే ఉన్నారు. రీసెంట్గా వచ్చిన ట్రైలర్ లో కూడా మంచి ఫన్ ఉండడంతో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.

జాతి రత్నాలు తరహా లోనే సినిమా కనెక్ట్ అయితే యూత్ ఏకబడి చూడడం కాయం. దానికి తోడు మంచి కామెడీ సినిమా వచ్చి చాలా కాలం అయింది కాబట్టి ఈ సినిమాకు గుడ్ టాక్ వస్తే మాత్రం ఈజీగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తప్పనిసరిగా టాక్ మాత్రం పాజిటివ్ గా ఉండాలి.

ఇక ఆ నమ్మకంతోనే సినిమా ప్రీమియర్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ హైదరాబాద్ వైజాగ్ నెల్లూరు తిరుపతి రాజమండ్రి వంటి నగరాల్లో 5వ తేదీన ప్రత్యేకమైన షోలు వేసేందుకు థియేటర్లను కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే మరికొన్ని సెంటర్లలో కూడా ప్రత్యేకమైన షోలు వేసేందుకు చర్చలు జరుగుతున్నాయి.

అక్టోబర్ 6వ తేదీన మిగతా సినిమాల నుంచి పోటీ ఉండడం వలన మ్యాడ్ సినిమా నిర్మాత ఈ రిస్క్ తీసుకోక తప్పడం లేదు. ఎందుకంటే ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా దసరా వరకు అంటే 12 రోజుల వరకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దసరా కు రవితేజ, బాలయ్య డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక మ్యాడ్ సినిమా ద్వారానే ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ అందుకుంటుందో చూడాలి.