Begin typing your search above and press return to search.

విశ్వక్ రభస.. నిర్మాత క్లారిటీ!

తన నిర్మాణంలో వస్తున్న మరో చిత్రం 'ఆదికేశవ'ను నవంబరు 10 నుంచి 24కు వాయిదా వేస్తున్న విషయాన్ని వెల్లడించేందుకు ప్రెస్ మీట్ పెట్టిన నాగవంశీ.. విశ్వక్ పోస్టు మీదా స్పందించాడు.

By:  Tupaki Desk   |   1 Nov 2023 3:36 PM GMT
విశ్వక్ రభస.. నిర్మాత క్లారిటీ!
X

తన కొత్త చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'ని డిసెంబరు 9 నుంచి వాయిదా వేస్తున్నారన్న సందేహాల నేపథ్యంలో హీరో విశ్వక్‌సేన్ ఇటీవల పెట్టిన సోషల్ మీడియా పోస్టు ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఆరు నూరైనా అనుకున్న డేట్‌కే తన సినిమా రావాల్సిందే అని.. డేట్ మారిస్తే ప్రమోషన్లకు కూడా రానన్నట్లుగా అతను మాట్లాడాడు. తన సినిమా డేట్ మార్చుకునేలా ఇండస్ట్రీలో కొందరు ఒత్తిడి తెస్తున్న సంకేతాలను అతనిచ్చాడు. దీని మీద సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే జరిగింది. హీరో అభీష్టానికి వ్యతిరేకంగా నిర్మాత నాగవంశీ సినిమాను వాయిదా వేస్తున్నాడా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో నాగవంశీ రెస్పాన్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తన నిర్మాణంలో వస్తున్న మరో చిత్రం 'ఆదికేశవ'ను నవంబరు 10 నుంచి 24కు వాయిదా వేస్తున్న విషయాన్ని వెల్లడించేందుకు ప్రెస్ మీట్ పెట్టిన నాగవంశీ.. విశ్వక్ పోస్టు మీదా స్పందించాడు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' డేట్ మారే అవకాశాలున్నట్లే అతను సంకేతాలు ఇచ్చాడు. ఏ హీరోకైనా రిలీజ్ డేట్ మారుస్తుంటే బాధ కలుగుతుందని.. 'ఆదికేశవ' విషయంలో వైష్ణవ్ తేజ్ కూడా అలాగే ఫీలయ్యాడని.. విశ్వక్ ఆవేదన కూడా అర్థం చేసుకోదగ్గదే అని నాగవంశీ చెప్పాడు. ఐతే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. ఇంకా పాటతో పాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ మిగిలి ఉందని.. అంతా అయ్యాకే ఒక నిర్ణయానికి వస్తామని నాగవంశీ తెలిపాడు.

డిసెంబరు రెండో వారంలో 'ఆపరేషన్ వాలెంటైన్'తో పాటు తమ సినిమా మాత్రమే వస్తుందని అనుకున్నామని.. 'సలార్' కారణంగా హాయ్ నాన్న, ఎక్స్‌ట్రా సినిమాలు ప్రిపోన్ కావడంతో ఇబ్బంది తలెత్తిందని.. ఐతే నాని, నితిన్ తమ బేనర్లలో సినిమాలు చేసి మంచి అనుబంధం కలిగి ఉన్న వారే అని.. కాబట్టి కొన్ని సర్దుబాట్లు తప్పవని నాగవంశీ అభిప్రాయపడ్డాడు. డిసెంబరు 29కి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'ని అనుకుంటున్న మాట వాస్తవమే అని.. అది మంచి డేట్ అని నాగవంశీ అన్నాడు.