Begin typing your search above and press return to search.

అనుదీప్ ఫ్యాన్ బేస్ వాడుకోవాలనుకున్నాం..!

అతను డైరెక్టర్ కళ్యాణ్ ని ఫ్రెండ్ అవడం.. అనుదీప్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దాన్ని వాడుకుందామని అతన్ని ఈ సినిమాలో సీనియర్ గా చూపించామని అన్నారు.

By:  Tupaki Desk   |   6 Oct 2023 3:47 AM GMT
అనుదీప్ ఫ్యాన్ బేస్ వాడుకోవాలనుకున్నాం..!
X

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అటు భారీ సినిమాలతో పాటుగా స్మాల్ బడ్జెట్ సినిమాలను చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా సితార బ్యానర్ నుంచి మ్యాడ్ మూవీ తెరకెక్కింది. ఈరోజు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమాలో ఎన్టీఆర్ బ్రదర్ ఇన్లా నార్నే నితిన్ హీరోగా నటించాడు. కళ్యాణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కాలేజ్ నేపథ్యంతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో సినిమా గురించి విషయాలను షేర్ చేసుకున్నారు నిర్మాత సూర్యదేవర నగ వంశీ.

తమ బ్యానర్ నిలబడింది అంటే అది త్రివిక్రమ్ గారి వల్లే అని.. ఆయన మమ్మల్ని నిలబెట్టారని అన్నారు వంశీ. మ్యాడ్ సినిమా మరో జాతి రత్నాలు అవుతుందని.. ఈ సినిమా అనుదీప్ ని తీసుకున్నామని. అతను డైరెక్టర్ కళ్యాణ్ ని ఫ్రెండ్ అవడం.. అనుదీప్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దాన్ని వాడుకుందామని అతన్ని ఈ సినిమాలో సీనియర్ గా చూపించామని అన్నారు. మ్యాడ్ గురించి మాత్రమే కాదు మహేష్ గుంటూరు కారం సినిమా గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివిటీ గురించి కూడా స్పందించారు నాగ వంశీ.

పూజా హెగ్దేని తీసేశారు కాదు ఆమెకు కుదరక చేయలేదు. మేము తీసేయడం కాదు ఆమె మా బ్యానర్ లో రెండు సినిమాలు చేసింది. ఆమెను మేము ఎప్పుడు కాదనుకోము. మహేష్ గారు సోషల్ మీడియాలో ఉన్నా చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు. త్రివిక్రం గారు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. చిన బాబు గారు అసలు ఎవరికి టచ్ లో ఉండరు. కానీ గుంటూరు కారం గురించి మాత్రం సోషల్ మీడియాలో అనవసరమైన డిస్కషన్స్ నడుస్తాయని అన్నారు.

ఇదే కాకుండా మళ్లీ రావే సినిమా నెట్ ఫ్లిక్స్ లో చూసి గౌతం తో సినిమా చేశామని జెర్సీ సినిమా తన సొంతంగా తీసుకున్న నిర్ణయమని అన్నారు నాగ వంశీ. తక్కువ టైం లోనే పెద్ద నిర్మాతగా మారడం బాగుంది కానీ అది పెద్ద బాధ్యతని అన్నారు. డీజే టిల్లు సినిమా సీక్వెల్ టిల్లు స్క్వేర్ సినిమా కావాలని హోల్డ్ చేశామని డీజే టిల్లు కన్నా ఇది డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని నమ్మకం కుదిరాకనే ఆ సినిమా వదులుతామని అన్నారు నాగ వంశీ.