Begin typing your search above and press return to search.

సితార నాగవంశీ.. లైనప్ లో ఎన్ని సినిమాలో..

ఈ సంస్థ బాధ్యతలను ప్రస్తుతం సూర్యదేవర నాగవంశీ చూసుకుంటున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 April 2024 4:53 AM GMT
సితార నాగవంశీ.. లైనప్ లో ఎన్ని సినిమాలో..
X

తెలుగు సినీ ఇండస్ట్రీలో తక్కువ టైమ్ లో పెద్ద నిర్మాణ సంస్థలుగా క్లిక్కయిన వాటిలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కచ్చితంగా ఉంటుంది. రాధాకృష్ణ స్టార్ట్ చేసిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థకు అనుబంధ సంస్థగా ఏర్పడింది సితార ఎంటర్టైన్మెంట్స్. ఈ సంస్థ బాధ్యతలను ప్రస్తుతం సూర్యదేవర నాగవంశీ చూసుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే పలు సినిమాలకు సహా నిర్మాతగా త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ ఫార్చూన్ ఫోర్ కూడా భాగం ఆవుతోంది.

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ బాబు బంగారం మూవీని డెబ్యూ చిత్రంగా నిర్మించిన సితార సంస్థ.. ఇప్పుడు భారీ సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతోంది. గతేడాది బుట్టబొమ్మ, సార్, మ్యాడ్, ఆది కేశవ సినిమాలను నిర్మించిన సితార సంస్థ.. ఇటీవల రిలీజైన టిల్లు స్క్వేర్ ను కూడా రూపొందించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను త్వరలోనే రిలీజ్ చేయనుంది. వేసవి కానుకగా మే17వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, హీరో సినిమాతో హీరోగా పరిచయమైన అశోక్ గల్లాతో మూవీ ప్రకటించింది. ఏప్రిల్ 5వ తేదీన అశోక్ బర్త్ డే సందర్భంగా సితార సంస్థ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది.

లవ్ కమ్ కామెడీ ఎంటర్టైనర్ గా అశోక్ గల్లా కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెరికా బ్యాక్ గ్రౌండ్ లో సినిమా కథ మొత్తం నడవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ చేతిలో ఉన్న సినిమాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఇప్పుడు అశోక్ గల్లా మూవీతో పాటు అనేక క్రేజీ చిత్రాలు ఉన్నాయి. అవేంటంటే?

- విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

- బాలకృష్ణ NBK 109

- దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్

- గౌతమ్ తిన్ననూరి మ్యాజిక్

- గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్

- సాయి దుర్గ తేజ్ గంజా శంకర్

- రవితేజ, రుక్మిణీ వసంత్ మూవీ

- సిద్ధు జొన్నలగడ్డ టిల్లు క్యూబ్

- మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ మ్యాక్స్

- అశోక్ గల్లా ప్రొడక్షన్ నెం.27

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అప్ కమింగ్ మూవీస్ లో చాలా వాటిపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యి ఉంది. మినిమమ్ హిట్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఏదేమైనా వైవిధ్యభరితమైన సినిమాలు నిర్మిస్తూ తెలుగులో రోజురోజుకూ క్రేజ్ పెంచుకుంటున్న సితార సంస్థ.. ఫ్యూచర్ లో కొత్త చిత్రాలతో ఎలాంటి లాభాలు సంపాదిస్తుందో చూడాలి.