Begin typing your search above and press return to search.

దేవర రైట్స్.. ఆ నిర్మాత ఏమన్నారంటే

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. దీంతో చాలా మంది దేవర థియేట్రికల్ రైట్స్ పై వస్తున్న వార్తలను ఉద్దేశించే నాగవంశీ ఈ పోస్ట్ పెట్టారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 April 2024 3:01 PM GMT
దేవర రైట్స్.. ఆ నిర్మాత ఏమన్నారంటే
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు.

అయితే విడుదల తేదీకి అనుగుణంగా షూటింగ్ పూర్తి చేసున్నారట మేకర్స్. ఇటీవల గోవాలో ఓ సాంగ్ షూట్ చేసినట్లు అప్డేట్ కూడా ఇచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం ప్రముఖ సంస్థలన్నీ పోటీ పడుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దేవర రైట్స్ ను దక్కించుకున్నట్లు టాక్ వినిపించింది.

దీనికితోడు ఇటీవల నాగవంశీ.. విశ్వక్ సేన్, సిద్ధుతో కలిసి ఎన్టీఆర్ ను మీట్ అయ్యారు. ఆ తర్వాత టిల్లు స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ లో తారక్, నాగవంశీ, త్రివిక్రమ్ కనిపించారు. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే తాజాగా నాగవంశీ సోషల్ మీడియాలో స్పందించారు. తమ బ్యానర్‌ కు సంబంధించి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

"సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అప్డేట్స్, ఫోటోల్లో ఎలాంటి వాస్తవం లేదు. మేం ప్రొడ్యూస్, డిస్ట్రిబ్యూట్‌ చేసే సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలను అఫీషియల్ గా మేమే ప్రకటిస్తాం. కాబట్టి దయచేసి ఆ రూమర్స్ నమ్మకండి" అని తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. దీంతో చాలా మంది దేవర థియేట్రికల్ రైట్స్ పై వస్తున్న వార్తలను ఉద్దేశించే నాగవంశీ ఈ పోస్ట్ పెట్టారని అంటున్నారు.

నిజానికి.. నాగవంశీతో జూనియర్ ఎన్టీఆర్ కు మంచి రిలేషన్ ఉంది. త్రివిక్రమ్ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై అరవింద సమేత సినిమా చేసిన తర్వాత తారక్, నాగవంశీ మరింత క్లోజ్ అయ్యారు. అందుకే దేవర హక్కులు.. నాగవంశీకి దక్కాయని వార్తలు వచ్చాయి. మరోవైపు, సితార సంస్థ చేతిలో అదిరిపోయే చిత్రాలు ఉన్నాయి. మ్యాడ్-2, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సహా అనేక సినిమాలు ఉన్నాయి. మరి కొత్త మూవీలతో నాగవంశీ ఎలాంటి లాభాలు అందుకుంటారో చూడాలి.