Begin typing your search above and press return to search.

స్పీడో మీట‌ర్-ఓడో మీట‌ర్ ద్వారా నాగ్ అశ్విన్ చెప్పేదేంటి?

ఈ మూవీలో వెహికల్స్ కి వాడే స్పీడో మీటర్ ఫోటోని ఇప్ప‌టికే ఇన్ స్టార్ ద్వారా షేర్ చేసాడు. ఆ స్పీడో మీటర్ మీద రెవ అనే పేరు ఉంది.

By:  Tupaki Desk   |   19 Aug 2023 7:56 AM GMT
స్పీడో మీట‌ర్-ఓడో మీట‌ర్ ద్వారా నాగ్ అశ్విన్ చెప్పేదేంటి?
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక బడ్జెట్ తో అడ్వాన్స్డ్ స్టొరీలైన్ తో ఫ్యూచరిస్టిక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుత కాలానికి ముందుగా భవిష్యత్తులో జరిగే కథగా దీనిని నాగ్ అశ్విన్ ఆవిష్కరిస్తున్నాడు. మూడో ప్రపంచ యుద్ధం నేపధ్యం లో సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే ఈ సినిమాని నాగ్ అశ్విన్ ఆవిష్కరిస్తున్నట్లు వార్త‌లొస్తున్నాయి.


అలాగే మహాభారతంలో క్యారెక్టర్స్ ని ఫ్యూచర్ స్టొరీకి ఆపాదించుకొని ఈ కథని తెరకెక్కిస్తున్నట్లు వినిపిస్తుంది. ఈ మూవీలో వెహికల్స్ కి వాడే స్పీడో మీటర్ ఫోటోని ఇప్ప‌టికే ఇన్ స్టార్ ద్వారా షేర్ చేసాడు. ఆ స్పీడో మీటర్ మీద రెవ అనే పేరు ఉంది. తాజాగా దీనికి కొన‌సాగింపుగా రెవా ఎలక్ట్రిక్ కారు యొక్క ఓడోమీటర్ రీడింగ్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసారు. దీంతో దీని ద్వారా సినిమాలో ఓ చ‌క్క‌ని సందేశాన్ని పాస్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

సినిమా కోసం ఎలక్ట్రిక్ కారును ఉపయోగిస్తున్నట్లు చిత్రం వివరిస్తుంది. పెట్రోలు - డీజిల్ వాహనాలతో ప్రపంచాన్ని కలుషితం చేయడం కంటే ఇ-బైక్‌లు మరియు EV వాహనాలను ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని నివారించ వ‌చ్చు అన్న అంశాన్ని చెప్ప‌క‌నే చెప్పారు. ఈనేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో నెటి జ‌నులు త‌మ సందేహాల్ని సైతం రెయిజ్ చేస్తున్నారు. ఈ ఓడోమీటర్ ద్వారా ఏదో రహస్యాన్ని పంచుకుంటున్నాడని కొందరు భావిస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ వాహనం యొక్క స్క్రీన్ అని కొందరు గ‌ట్టిగా చెబుతున్నారు.

సినిమాలో ఇలాంటి ట్విస్టులు ఇంకా చాలా ఉంటాయ‌ని గెస్ చేస్తున్నారు. గ‌తంలో పోస్ట్ చేసిన స్పీడో మీట‌ర్ కి- ఈ ఓడో మీట‌ర్ కి ఏదో సంబంధం ఉందంటూ కొత్త సందేహాలు తెర‌పైకి తెస్తున్నారు. ఈసినిమా కోసం మ‌హీంద్రా కంపెనీకి చెందిన కార్ల‌ను భారీ ఎత్తున వినియోగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ ర‌కంగా ప్రాజెక్ట్ లో ఆనంద్ మ‌హీంద్రా కూడా భాగ‌మ‌య్యారు. సాధార‌ణంగా సెల‌బ్రిటీలు రేంజ్ రోవర్స్ మరియు బెంజ్ లాంటి ల‌గ్జ‌రీ కార్ల‌ను వినియోగిస్తుంటారు. కానీ నాగ్ అశ్విన్ వాళ్ల ఆలోచ‌న‌కి భిన్నంగా 500 కోట్ల బ‌డ్జెట్ తో సినిమా తీస్తూ ఎల‌క్ట్రీక్ కారుని త‌న సినిమా క‌థా వ‌స్తువ‌గా భాగం చేసారు.