Begin typing your search above and press return to search.

స్టార్‌డ‌మ్ కోసం సీన్లు రాస్తే వర్క‌వుట్ కాదు: నాగ్ అశ్విన్

మోస్ట్ అవైటెడ్ 2024 మూవీ `కల్కి 2898 AD` విడుదలకు ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది.

By:  Tupaki Desk   |   15 Jun 2024 7:57 AM GMT
స్టార్‌డ‌మ్ కోసం సీన్లు రాస్తే వర్క‌వుట్ కాదు: నాగ్ అశ్విన్
X

మోస్ట్ అవైటెడ్ 2024 మూవీ `కల్కి 2898 AD` విడుదలకు ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ చిత్రం భారీ హైప్ తో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. నిస్సందేహంగా ఇటీవలి కాలంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఏకైక సైన్స్ ఫిక్ష‌న్ చిత్ర‌మిది. జూన్ 27.. రిలీజ్ డే కావ‌డంతో అన్నిర‌కాలుగా స‌స్పెన్స్ కి తెరప‌డ‌నుంది.

బాహుబ‌లి స్టార్ నుంచి వ‌స్తున్న మ‌రో భారీ ప్ర‌యోగాత్మ‌క చిత్రంగా క‌ల్కి చిత్రాన్ని ప్ర‌పంచం చూస్తోంది. ఇందులో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల తార‌లు కీలక పాత్రల్లో న‌టించ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ల‌ను డైరెక్ట్ చేయ‌డం అనేది ఒక పెద్ద సవాల్ క‌దా? అని ప్ర‌శ్నించ‌గా... కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ఛాలెంజ్ గురించి ఓపెన‌య్యారు.

ప్రభాస్- దీపికా పదుకొనే వంటి పెద్ద స్టార్‌డమ్ ఉన్న తార‌ల్ని ఎలా డీల్ చేశారు? అని ఫిలింకంపానియ‌న్ ప్ర‌శ్నించ‌గా.. కొన్ని విషయాల్లో తాను నిర్లక్ష్యంగా ఉన్నాన‌ని, ఇది ఒక విధంగా మంచిదని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. అదో ర‌కం మ‌తిస్థిమితం లేనివాడిని అని అత‌డు వ్యాఖ్యానించిన‌ట్టు ఫిలింకంపానియ‌న్ పేర్కొంది. నాగ్ అశ్విన్ మ‌రింత వివ‌ర‌ణాత్మ‌కంగా మాట్లాడుతూ.. ప్ర‌భాస్ - దీపిక‌ల‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానుల నుంచి వారు పొందే ప్రేమ గురించి నాకు పూర్తిగా తెలుసునని అన్నాడు. ఫ‌లానా సీన్ లో త‌మ ఫేవ‌రెట్ తార‌ల్ని చూసాక‌ అభిమానులు ఎలా రెస్పాండ్ అవుతారో కూడా నాకు తెలుసున‌ని అన్నాడు. ఒక‌వేళ ఉద్దేశపూర్వకంగా తార‌ల‌ స్టార్‌డమ్‌ను ఎలివేట్ చేయ‌డానికి సన్నివేశాలు సృష్టిస్తే సినిమా విఫలమవుతుందని ఆయన స్పష్టం చేశారు. భైరవ లాంటి క్యారెక్టర్ పేపర్‌పై చేసే ప‌ని ఆధారంగా అది తెరపైనా, ప్రేక్షకులతో కలిసి పని చేస్తుందని నాగ్ అశ్విన్ అన్నారు. ప్రేక్షకుల స్పందన గురించి ఆలోచించి ఆపై సన్నివేశాన్ని రాస్తే రివర్స్ ఇంజనీరింగ్ స్క్రీన్‌పై ఎల్లప్పుడూ ఫ్లాట్‌గా అనిపిస్తుందని వ్యాఖ్యానించాడు.

కల్కి 2898 AD నాగ్ అశ్విన్ కెరీర్ లో నాలుగో చిత్రం. ప్రభాస్‌తో అతడి మొదటి చిత్రం. సైన్స్ అంశాల‌తో పాటు, పురాణ పౌరాణిక వైజ్ఞానిక కల్పన ఈ చిత్రంలో భాగం. ఇందులో బుజ్జి పాత్ర‌కు కీర్తి సురేష్ వాయిస్ అందించారు. ప్రభాస్ పాత్ర భైరవ వాహనం బుజ్జి ఇందులో వెరీ స్పెష‌ల్. ఈ చిత్ర క‌థాంశం 3102 BC - 2898 AD మధ్య కాలానికి 6000 సంవ‌త్స‌రాన్ని క‌లుపుతూ సాగుతుంది. భ‌విష్య‌త్ ప్ర‌పంచం ఎలా ఉంటుందో తెర‌పై ఆవిష్క‌రించామ‌ని నాగ్ అశ్విన్ గ‌తంలో వెల్ల‌డించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వని దత్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. సంతోష్ నారాయణన్ చిత్రానికి సంగీతం అందించారు. సెర్బియా సినిమాటోగ్రాఫర్ డ్జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.