Begin typing your search above and press return to search.

ఏం చేసినా.. నాగి అదరగొట్టేశారుగా!

సిల్వర్ స్క్రీన్ పై నాగ్ అశ్విన్ ఓ సరికొత్త అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారని ట్రైలర్ చూస్తుంటే ఈజీగా అర్థమవుతుంది.

By:  Tupaki Desk   |   11 Jun 2024 5:48 AM GMT
ఏం చేసినా.. నాగి అదరగొట్టేశారుగా!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న కల్కి 2898 ఏడీ మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ సృష్టించిన కల్కి ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు సినిమాపై ఉన్న అంచనాలు.. నిన్న మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఆకాశాన్ని తాకాయి. అసలు ఏం ఉందిరా ట్రైలర్.. వావ్ అంటున్నారు సినీ ప్రియులు.

సిల్వర్ స్క్రీన్ పై నాగ్ అశ్విన్ ఓ సరికొత్త అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారని ట్రైలర్ చూస్తుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇండియన్ మూవీ లవర్స్ కనెక్ట్ అయ్యేలా క్రేజీ స్టోరీ తీసుకున్న నాగ్ అశ్విన్.. దానికి మైథాలజీ కాన్సెప్ట్ ను యాడ్ చేశారు. భూమి మీద మొదటి నగరం, చివర నగరమైన కాశీలో సర్వస్వం దోచుకున్న వారితో మనుషులు ఎలాంటి పోరాటం చేశారు? ఎలా విజయం సాధించారనేది కల్కి మెయిన్ కాన్సెప్ట్ గా తెలుస్తోంది.

కల్కి ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. నాగ్ అశ్విన్ పనితనానికి ఓ రేంజ్ లో ప్రశంసలు వస్తున్నాయి. ఆయన విజన్, టాలెంట్ తో పాటు క్రియేషన్ ను విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు. అంచనాలకు తగ్గట్టు ట్రైలర్ ను కట్ చేశారని కొనియాడుతున్నారు. హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవారు.. డెనిస్ విల్నెవ్ డ్యూన్ సిరీస్ తో పాటు సైన్స్ ఫిక్షన్ డ్రామా బ్లాక్ పాంథర్ నుంచి నాగ్ అశ్విన్ రిఫరెన్స్ తీసుకున్నారని సోషల్ మీడియాలో చెబుతున్నారు.

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు మ్యాడ్ మ్యాక్ ఫ్యూరీ రోడ్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ది గోల్డెన్ చైల్డ్ లో ఉన్న సీన్స్ ఇన్స్పిరేషన్.. కల్కిలో కనిపిస్తున్నట్లు మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. హాలీవుడ్ లోని అనేక సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని తెరకెక్కిస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా అలాగే చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇది పక్కన పెడితే ఎక్కడ ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఏంటి.. నాగి అదరగొట్టేశారని అంటున్నారు.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ప్రభాస్ తో పాటు దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్ వంటి ఎందరో స్టార్ నటీనటులు కనిపించనున్నారు. సీనియర్ హీరోయిన్ శోభన, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కామిక్ రోల్స్ లో నటించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ బుజ్జి వెహికల్ కు కీర్తి సురేష్ క్యూట్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. మరి జూన్ 27వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా.. ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.