Begin typing your search above and press return to search.

ప్రాజెక్ట్ K - నాగ్ అశ్విన్ ఇది తగునా..?

గ‌తంలో తెలంగాణ సెక్ర‌టేరియ‌ట్ డిజైన్

By:  Tupaki Desk   |   20 July 2023 10:49 AM GMT
ప్రాజెక్ట్ K - నాగ్ అశ్విన్ ఇది తగునా..?
X

ప్రస్తుతం భారత సినీ ఇండస్ట్రీలో అలాగే సోషల్​మీడియాలో చర్చంతా 'ప్రాజెక్ట్‌ కె' గురించే. మున్నపెన్నడు చూడని అతిపెద్ద భారీ దృశ్యరూపంగా దీన్ని రూపొందించబోతున్నట్లు మూవీటీమ్ చెబుతోంది. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్​తో దీన్ని రూపొందిస్తున్నారు. చెప్పినట్టుగానే ఈ సినిమాను గ్లోబల్​ వైడ్​గా ప్రమోషన్స్​ చేస్తుంది మూవీటీమ్​.

ఇందులో భాగంగానే తాజాగా ప్రభాస్ ఫస్ట్ లుక్​ను మార్వెల్​ హీరోటైప్​లో రిలీజ్ చేసింది. కానీ దీనిపై మిక్స్​డ్​ రివ్యూస్​ వస్తున్నాయి. అసలే వరుస ఫ్లాప్​లో ఉన్న ప్రభాస్​కు ఈ సినిమా కలిసొస్తుందనుకుంటే.. ఈ పోస్టర్​ను రిలీజ్​ చేసి దర్శకుడు నాగ్​ అశ్విన్ నిరుత్సాహపరిచాడని అంటున్నారు. ఫ్యాన్​మేడ్ పోస్టర్​ అంటూ ట్రోల్స్ చేశారు. ముఖ్యంగా నాగ్​ అశ్విన్​ను టార్గెట్​ చేస్తున్నారు. హాలీవుడ్ సినిమా ఐరన్​ మ్యాన్​, బ్లాక్ ఆడమ్ లుక్స్​ను కలిపి కాపీ చేశారని అంటున్నారు. వేరే బాడీకి ఫేస్ ఫొటో షాప్ చేసి తగిలించారని ఫుల్​ ట్రోల్ చేస్తున్నారు.

ఇప్పటికే రాజమౌళి, త్రివిక్రమ్ వంటి దర్శకులు.. హాలీవుడ్​ను చూసి స్ఫూర్తి చెంది.. వారి సన్నివేశాలను రీక్రియేట్​ చేశామంటూ తమను తాము సమర్థించుకుంటున్నారు. ఇప్పుడు నాగ్​ అశ్విన్​ కూడా అదే చేస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది అశ్విన్​.. గతంలో చేసిన ఓ పాత ట్వీట్​ను బయటకు తీసుకొచ్చి మరీ ఓ ఆటాడేసుకుంటున్నారు.

గ‌తంలో తెలంగాణ సెక్ర‌టేరియ‌ట్ డిజైన్ చూసి దర్శకుడు నాగ్ అశ్విన్ కొన్ని సూచనలు చేశారు. ఈ డిజైన్ అంతగా బాలేద‌ని అన్నారు. అయితే ఇది రాజ‌కీయ కోణంలో కాద‌ని, నిర్మాణ ప‌రంగా తనకు ఆ డిజైన్ నచ్చలేదని చెప్పారు. అవ‌స‌ర‌మైతే తాను మంచి ఆర్కిటెక్ట్‌ల‌ను సూచిస్తానని, మ‌రింత మెరుగ్గా డిజైన్ చేద్దామని ట్వీట్ చేశారు.

ఇప్పుడా ట్వీట్​నే బయటకు తీసి.. కొంతమంది తెలంగాణ అభిమానులు, నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ప్రాజెక్ట్ కె ఫ‌స్ట్ లుక్ అంతగా బాలేదని.. అయితే ఇది రాజ‌కీయంగా కాద‌ని, సినిమా ప‌రంగా తమకు ఆకట్టుకోలేదని.. అవ‌స‌రమైతే మంచి డిజైన‌ర్ల‌ను సూచిస్తామ‌ని.. ఫ‌స్ట్ లుక్‌ను మ‌రింత బాగా తీర్చిదిద్దుదామని అంటున్నారు.

మొత్తంగా జరుగుతున్న పరిణామాలన్నిటినీ చూస్తుంటే... ఫస్ట్ లుక్​ పోస్టర్​తో నిరాశలో ఉన్న ప్రభాస్​ ఫ్యాన్స్​.. రేపు(జులై 21)మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ రోజే టైటిల్ గ్లింప్స్ రిలీజ్ కానుంది. అందుకే దీనిపై భారీ స్థాయిలో ఆశలు, అంచనాలు పెట్టుకున్న అభిమానులు.. నాగ అశ్విన్​ కనీసం టైటిల్​ గ్లింప్స్​తోనైనా సంతృప్తి పరచాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..