Begin typing your search above and press return to search.

ఆ యంగ్ హీరో మామ్ నిర్మాత అవ్వ‌డానికి కార‌ణం!

యంగ్ హీరో నాగ‌శౌర్య మామ్ ఉషా మూల్పూరి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.

By:  Tupaki Desk   |   15 May 2024 9:30 AM GMT
ఆ యంగ్ హీరో మామ్ నిర్మాత అవ్వ‌డానికి కార‌ణం!
X

యంగ్ హీరో నాగ‌శౌర్య మామ్ ఉషా మూల్పూరి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. నాగ‌శౌర్య కంటే ఉష సోష‌ల్ మీడియాలో మ‌రింత పాపుల‌ర్. `ఛ‌లో` సినిమాతో ఐరా క్రియేష‌న్స్ సంస్థ‌ను స్థాపించి ఉష నిర్మాత‌గా ప‌రిచ‌యమైన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమాతోనే నిర్మాత‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు. ఆ సినిమాతో నాగ‌శౌర్య కెరీర్ ని కొత్త మ‌లుపు తిప్పింది. అప్ప‌టికే వ‌రుస ప్లాప్ ల‌తో ఉన్న హీరోకి అవ‌కాశాలు త‌గ్గిన స‌మ‌యంలో నేరుగా సొంత నిర్మాణ సంస్థ‌నే స్థాపించి సంచ‌ల‌నం సృష్టించారు.

ఆ సంస్థ తొలి సినిమాని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా లాంచ్ చేసిన ద‌గ్గ‌ర నుంచి రిలీజ్ వ‌ర‌కూ ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. తాజాగా ఆ సంస్థ ప్రారంభించ‌డానికి గ‌ల కార‌ణాలు? ఎలాంటి ప‌రిస్థితుల్లో ఐరా క్రియేష‌న్స్ లాంచ్ అయిందో ఉష రివీల్ చేసారు. అవి ఏంటో ఆమె మాట‌ల్లోనే..`చిన్నప్పుడు నాగశౌర్య పెద్దగా చదువుకునేవాడు కాదు. అందువలన నేను కొట్టేదాన్ని. నాగశౌర్య హీరోగా ట్రై చేస్తానని అంటే వద్దనే అన్నాను. కానీ ఆ తరువాత సరే అనాల్సి వచ్చింది. నాగశౌర్య హీరోగా తనంతట తానుగా కష్టపడుతూ అవకాశాలు తెచ్చుకున్నాడు.

అందులో మా ప్రమేయమేమీ లేదు. ఏ రోజున కూడా మేము నిర్మాతలుగా మారాలని అనుకోలేదు. కొన్ని కారణాల వలన అలా మారవలసి వచ్చింది. నాగశౌర్య `ఛలో` సినిమా చేయాలనుకున్నాడు. నిర్మాత కోసం వెతుకుతున్నాడు. తనకి పారితోషికం ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పి ఒక నిర్మాతను ఒప్పించడానికి నాగశౌర్య ప్రయత్నించాడు.ఆ విషయాన్ని నాగశౌర్య నాకు చెప్పినప్పుడు చాలా బాధగా అనిపించింది. అవసరం లేదు ఆ సినిమా మనమే చేద్దామని చెప్పాను.

అప్పటికి సినిమా బిజినెస్ గురించి మాకు ఏమీ తెలియదు. ఆ సినిమాను చేశాము . పెద్ద హిట్ అయింది. అయినా మాకు డబ్బులు రాలేదు. డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ డబ్బులు ఇవ్వలేదు. కానీ అదే సంస్థ‌లో నిర్మించిన `నర్తనశాల` సినిమా ప్లాప్ అవ్వ‌గానే ఉదయాన్నే వచ్చి ఆఫీస్ దగ్గర కూర్చున్నారు. అప్పుడే అర్ధమైంది ఇండ‌స్ట్రీ అంటే ఇలా ఉంటుంద‌ని` అని అన్నారు. ప్ర‌స్తుతం నాగ‌శౌర్య హీరోగా `పోలీస్ వారి హెచ్చ‌రిక` సినిమాతో పాటు మ‌రో రెండు సినిమాలు చేస్తున్నాడు.