Begin typing your search above and press return to search.

నాగశౌర్య.. సొంత ఇంట్లోనే మరో రిస్క్?

హీరో నాగ శౌర్య. అప్పటివరకు చిన్న హీరోగా ఉన్న ఆయన.. ఛలో సినిమా సక్సెస్ తో ఒక్కసారిగా తన మార్కెట్ ను పెంచుకున్నారు.

By:  Tupaki Desk   |   7 Sep 2023 6:16 AM GMT
నాగశౌర్య.. సొంత ఇంట్లోనే మరో రిస్క్?
X

టాలీవుడ్ యంగ్ హీరోల్లో అనూహ్యంగా రైజ్ అయి.. మరో స్థాయికి వెళ్తాడనే అంచనాలు కలిగించి.. చివరికి ఉన్న ఇమేజ్ ను కాపాడుకోవడం కోసం గట్టిగా కష్టపడుతున్న హీరో నాగ శౌర్య. అప్పటివరకు చిన్న హీరోగా ఉన్న ఆయన.. ఛలో సినిమా సక్సెస్ తో ఒక్కసారిగా తన మార్కెట్ ను పెంచుకున్నారు. ఇది ఆయన కెరీర్‌కు గొప్ప మలుపులా కనిపించింది. కానీ అది ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. అయితే ఆయన హీరోగా నటించడంతో పాటు తన పేరెంట్స్ హోం బ్యానర్ ఐరా క్రియేషన్స్ ను కూడా చూసుకుంటారన్న సంగతి తెలిసిందే.

ఐరా క్రియేషన్స్ నాగశౌర్య పేరెంట్స్ దే. శౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ ముల్పూరి ఆ బ్యానర్ కు ప్రెజెంటర్ గా వ్యవహరిస్తుండగా.. తల్లి ఉషా ముల్పూరి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ బ్యానర్ లో ఛలో, నర్తనశాల, అశ్వద్థామ, కృష్ణ వ్రింద విహారి వంటి సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు శౌర్య తల్లిదండ్రులు సినిమా నిర్మాణంపై అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.

దీంతో శౌర్య.. తన సొంత బ్యానర్ ను కొంత మంది స్నేహితులతో కలిసి కొత్తగా ప్రారంభించాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శౌర్య ఎలాగో మొదటి నుంచి ఇండిపెండెంట్ గానే ఉంటున్నారు. ఇప్పుడు పెళ్లి కూడా అయిపోయింది. కాబట్టి తన కెరీర్ కు సంబంధించి తానే చూసుకోగలరు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంటున్నారు.

అయితే సొంత బ్యానర్ స్థాపించే విషయమై శౌర్యను అడగగా.. ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని, భవిష్యత్ లో చేస్తానో చేయనో ఇప్పటికైతే తెలియదని చెప్పారు. ప్రస్తుతం తన చేతిలో ఒకటి రెండు ప్రాజెక్ట్​లను ఉన్నాయని, వాటిని మంచి సినిమాలుగా మార్చడంపైనే తన పూర్తి ఫోకస్ ఉందని చెప్పారు.

ఇక ఈ విషయమై శౌర్య తల్లి ఉషను మాట్లాడుతూ.. తాము టాలీవుడ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు.. శౌర్య తన బిజినెస్ తాను చూసుకుంటాడంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె పేర్కొంది. కానీ శౌర్య సొంతంగా బ్యానర్ స్థాపిస్తున్నారా లేదా అనేది ఆమే క్లారిటీగా చెప్పలేదు.