Begin typing your search above and press return to search.

అంత పెద్ద ఫ్లాప్ వచ్చినా.. మళ్ళీ అదే దర్శకుడితో..

అయితే ఇప్పుడు నాగశౌర్య- పవన్ బాసంశెట్టి మరోసారి రిపీట్ కానుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్వరలోనే వీరి ప్రాజెక్ట్ స్టార్ట్ కానుందని సమాచారం.

By:  Tupaki Desk   |   11 March 2024 6:25 AM GMT
అంత పెద్ద ఫ్లాప్ వచ్చినా.. మళ్ళీ అదే దర్శకుడితో..
X

తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోల్లో లవర్ బాయ్ గా నాగశౌర్య ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో.. తన హ్యాండ్సమ్ లుక్స్ తో ఆకట్టుకుంటారు. అయితే నాగశౌర్యకు ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్లు ఫర్ఫెక్ట్ గా సుతావుతాయనే టాక్ ఉంది. లవర్ బాయ్ గా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టినవి కూడా ఆ జోనర్ చిత్రాలే.

అయితే ఆ మధ్య కాలంలో కొత్త దనం కోసం రకరకాల ప్రయోగాలు చేసి ఫెయిల్ అయ్యారు నాగశౌర్య. ఆ సినిమాలేవీ అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ అందించలేదు. ఆ తర్వాత ఎలా అయినా గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టితో చేతులు కలిపారు. వీరి కాంబోలో రంగబలి సినిమా తెరకెక్కింది. ట్రైలర్, టీజర్, ప్రమోషన్లు.. ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. కానీ కామెడీ వ‌ర్కౌట్ అయినా స్టోరీలో బ‌లం లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది.

థియేటర్లలో రిలీజైన నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది రంగబలి మూవీ. అయితే కథ విషయంలో డైరెక్టర్ గాడి తప్పినా.. నాగశౌర్య తన నటనతో అదరగొట్టారు. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో మ‌రింత ఎన‌ర్జీతో నటించారు. అయితే ఇప్పుడు నాగశౌర్య- పవన్ బాసంశెట్టి మరోసారి రిపీట్ కానుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్వరలోనే వీరి ప్రాజెక్ట్ స్టార్ట్ కానుందని సమాచారం.

అయితే ఈ కాంబో రిపీట్ వార్తలపై నెట్టింట రకరకాలుగా కామెంట్లు వస్తున్నాయి. రంగబలిలో కామెడీ ఓకే గానీ.. స్టోరీ రైటింగ్ బాలేదని చెబుతున్నారు. మరి రెండో సినిమాలో పవన్.. ఏం చేయనున్నారోని అంటున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోమని సూచిస్తున్నారు. తాను హిట్ కొట్టి.. నాగశౌర్యకు సూపర్ హిట్ ఇవ్వాలని కోరుతున్నారు. రంగబలి మిస్టేక్స్ రిపీట్ కాకుండా చూసుకోవాలని చెబుతున్నారు.

మొదట్లో టాలీవుడ్ యంగ్ తనకు పోటీ ఇస్తున్నా.. నాగశౌర్య తనదైన శైలిలో దూసుకెళ్తూ ఇండస్ట్రీలో హిట్లు కొట్టారు. సొంత బ్యానర్ తోపాటు బయట సంస్థలతో కలిసి సినిమాలు చేశారు. కొన్నాళ్ళకే వరుస ఫ్లాఫ్స్ చూసిన ఈ హీరో రంగబలి తర్వాత కొత్త మూవీ ఇంతవరకు ప్రకటించలేదు. ఇప్పుడు రంగబలి కాంబో రిపీట్ అవ్వనుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.