నాగశౌర్య ఎందుకిలా వెనకబడిపోతున్నాడు?
అయితే 'బ్యాడ్ బాయ్ కార్తీక్' మూవీతో నాగశౌర్య ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. శ్రీ వైష్టవీ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ మూవీలో నాగశౌర్యకు జోడీగా విధి నటిస్తోంది.
By: Tupaki Desk | 13 May 2025 11:30 PMఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన సత్తా చాటిన హీరో నాగశౌర్య. 'చెలో' మూవీతో కెరీర్ బెస్ట్ సూపర్ హిట్‌ని సొంతం చేసుకుని వార్తల్లో నిలిచాడు. వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా ఇద్దరి కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. అంతే కాకుండా హీరోగా నాగశౌర్య కెరీర్‌కు మరింత బూస్ట్ ఇచ్చింది. వసూళ్ల పరంగానూ నాగశౌర్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచింది. ఏకంగా రూ.24 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలని విస్మయపరిచింది.
ఈ మూవీ తరువాత నాగశౌర్యకు ఆ స్థాయి విజయం దక్కలేదు. ఓ బేబీ హిట్ అయినా అది సమంత ఖాతాలోకి వెళ్లిపోయింది. సొంత బ్యానర్‌లో అశ్వద్దామ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆ తరువాత వరుడు కావలెను, లక్ష్య, కృష్ణ వ్రింద విహారి అన్నా...రంగబలి అన్నా ఫలితం లేకుండా పోయింది. చివర్లో వచ్చిన 'రంగబలి'తో నాగశౌర్య విమర్శలు కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న నాగశౌర్య వరుసగా నాలుగు సినిమాలని లైన్‌లో పెట్టాడు.
అందులో పోలీస్ వారి హెచ్చరిక, నారీ నారీ నడుము మురారి షూటింగ్ పూర్తయ్యాయి. మరో రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే 'బ్యాడ్ బాయ్ కార్తీక్' మూవీతో నాగశౌర్య ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. శ్రీ వైష్టవీ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ మూవీలో నాగశౌర్యకు జోడీగా విధి నటిస్తోంది. రామ్ దేసిన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ని ప్రకటించబోతున్నారు.
ఇందులో సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ నటిస్తున్నారు. చాలా కాలంగా రేసులో వెనకబడిన నాగశౌర్య ఈ మూవీతో మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలనే పట్టదలతో ఉన్నాడట. అందుకే టైటిల్ దగ్గరి నుంచి ప్రతి విషయంలోనూ కేర్ తీసుకుంటూ వస్తున్నాడని, ఈ మూవీతో ఎలాగైనా సక్సెస్‌ని సాధించి మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేస్తాడనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. మరి నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వస్తాడా? అన్నది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వరకు వేచిచూడాల్సిందే.