Begin typing your search above and press return to search.

నాగ్.. సైలెన్స్ తో ట్విస్ట్ ఇవ్వడుగా..

అక్కినేని నాగార్జున గత ఏడాది బంగార్రాజుతో పరవాలేదు అనిపించినప్పటికి ఘోస్ట్ సినిమాతో మాత్రం దారుణంగా డిజాస్టర్ ఎదుర్కొన్నాడు.

By:  Tupaki Desk   |   17 Nov 2023 3:42 AM GMT
నాగ్.. సైలెన్స్ తో ట్విస్ట్ ఇవ్వడుగా..
X

అక్కినేని నాగార్జున గత ఏడాది బంగార్రాజుతో పరవాలేదు అనిపించినప్పటికి ఘోస్ట్ సినిమాతో మాత్రం దారుణంగా డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. అంతకుముందు చేసిన వైల్డ్ డాగ్, మన్మధుడు 2, దేవ్ దాస్, ఆఫీసర్, రాజుగారి గది 2, ఓం నమో వెంకటేషయా సినిమాలు కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. నాగార్జునకు చివరగా వచ్చిన సాలీడ్ హిట్ అంటే సోగ్గాడే చిన్ని నాయన తో మాత్రమే వచ్చింది.

2016లో ఆ సినిమా తరువాత మళ్ళీ అలాంటి హిట్ ఇప్పటివరకు పడలేదు. ఇక 7 ఏళ్ళుగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నాగార్జున ఇప్పుడు సంక్రాంతి సీజన్ చాలా అవసరం. సంక్రాంతికి వచ్చిన ప్రతీసారి నాగార్జునకు మంచి విజయాలు దక్కాయి. ఇక ఇప్పుడు నా సామి రంగ సినిమాను కూడా అదే టైమ్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా కంటెంట్ నుంచి క్యారెక్టర్ వరకు అన్ని అంశాలు కూడా సంక్రాంతికి క్లిక్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక మిగతా సినిమాల నుంచి పోటీ బలంగా ఉన్నప్పటికీ నాగ్ వెనక్కి తగ్గే అవకాశం లేదని అనిపిస్తోంది. గుంటూరు కారం, హనుమాన్, ఈగల్ సినిమాలు సంక్రాంతిని బలంగా టార్గెట్ చేసినట్లు అప్డేట్స్ ద్వారా క్లారిటీ వస్తోంది. ఇక సంక్రాంతికి విజయ్ దేవరకొండ ఖుషీ కూడా రాబోతోంది. అలాగే వెంకటేష్ సైంధవ్ కూడా సంక్రాంతి పోటీలోనే రాబోతోంది.

అయితే ఈ కఠినమైన పోటీలో థియేటర్స్ దొరకడం అంత ఈజీ కాదు. అయితే సంక్రాంతి సినిమాలలో రాబోయే అన్ని సినిమాలు పండక్కు రానున్నట్లు ఏదో ఒక క్లారిటీ ఇస్తున్నప్పటికి నాగార్జున నా సామి రంగ సినిమాకు సంబంధించిన క్లారిటీ రావడం లేదు. సినిమా వాయిదా పడనుందని చాలా రకాల గాసిప్స్ వస్తున్నా కూడా నాగార్జున ఏమాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

గాసిప్స్ ఎన్ని వస్తున్నా ఏమి పట్టనట్లు సినిమా షూటింగ్ ను శరవేగంగా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను డిసెంబర్ రెండవ వారానికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి అంత త్వరగా ఫినిష్ చేసుకుంటున్న నాగార్జున అనుకున్న సమయానికి వస్తాడా?లేదంటే మరొక డేట్ ఫిక్స్ చేసుకుంటాడా? అనేది వేచి చూడాలి.