Begin typing your search above and press return to search.

14 ఏళ్ల వ‌ర‌కూ నాగార్జున సంక్రాంతి అక్క‌డే!

కింగ్ తో పాటు అల్ల‌రి న‌రేష్‌.. రాజ్ త‌రుణ్ లాంటి యంగ్ హీరోలు కూడా న‌టించ‌డంతో తెర మ‌రింతం అందంగా క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   14 Jan 2024 7:00 AM GMT
14 ఏళ్ల వ‌ర‌కూ నాగార్జున సంక్రాంతి అక్క‌డే!
X

కింగ్ నాగార్జున `నా సామిరంగ` రిలీజ్ తో సంక్రాంతి సంబరాలు మొద‌లు పెట్టేసిన సంగ‌తి తెలిసిందే. సంక్రాంతికి ప‌ర్పెక్ట్ రిలీజ్ గా ఈ సినిమా ని యూనిట్ భావిస్తోంది. `గుంటూరు కారం`...`సైంధ‌వ్` సినిమా జాన‌ర్లు వేరు అయితే సంక్రాంతి సంబురాల‌న్నీ `నా సామిరంగ‌`లో క‌నిపిస్తున్నాయి. కింగ్ తో పాటు అల్ల‌రి న‌రేష్‌.. రాజ్ త‌రుణ్ లాంటి యంగ్ హీరోలు కూడా న‌టించ‌డంతో తెర మ‌రింతం అందంగా క‌నిపిస్తుంది.

మ‌రి తెరపైనా సంక్రాంతి షురూ చేసిన నాగార్జున తెర వెనుక సంక్రాంతి ఎలా ఉండేది? బాల్యంలో ఆయ‌న సంక్రాంతిని ఎలా సెల‌బ్రేట్ చేసుకునేవారు? అంటే చాలా సంగ‌తులే తెలుస్తున్నాయి. ఈ విష‌యాలు ఆయ‌నే స్వ‌యంగా అభిమానుల‌తో పంచుకున్నారు. ఏ పండ‌గొచ్చినా త‌ప్ప‌కుండా అమ్మ వాళ్ల ఊరు దెందులూరులో సెల‌బ్రేట్ చేసుకోవ‌డం అల‌వాటు అటు. అందులోనూ సంక్రాంతి పండుగ అస్సలు మిస్ అయ్యే వారు కాదుట‌.

సెల‌వులు ఇవ్వ‌గానే దెందులూరు వెళ్లిపోయేవారుట‌. ఇలా 14 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కూ ఇలాగే త‌న బాల్య గ‌డించింద‌ని చెప్పుకొచ్చారు. అక్క‌డ‌ అంద‌మైన పంట పొలాలు..ప‌చ్చ‌ని కొబ్బ‌రి చెట్లు..ఆ వాతావర‌ణం ఎంతో అందంగా..ఆహ్లాదంగా ఉండేద‌న్నారు. గాలి పటాలు....బొమ్మ‌ల‌తో ఆడుకోవడం ఆ వ‌య‌సులో ఎంతో స‌ర‌దాగా ఉండేద‌న్నారు. సెలవులు ఉన్న‌న్ని రోజులు దెందులూరు చుట్టూనే తిరిగేవారుట‌.

కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే ద‌గ్గ‌ర్లో ఉన్న ఏలూరుకి వెళ్లేవారుట‌. అదెంతో సంతోషంగా ఉండేద‌న్నారు. అలా త‌న స్కూల్ డేస్ ముగిసాయి అన్నారు. ఆ త‌ర్వాత కాలీజీలో చేర‌డంతో లైఫ్ స్టైల్ అంతా మారిపోయింద‌న్నారు. ఆ త‌ర్వాత సిటీల్లో ఉండ‌టం..విదేశాల్లో చ‌దువుకోవ‌డంతో అన్నింటికి దూరం కావాల్సి వ‌చ్చింద‌న్నారు. ఇప్పుడు ప‌ల్లెటూళ్లు కూడా చాలా మారిపోయాయి. స్కార్ట్ ఫోన్లు వ‌చ్చాక అంతా ఫోన్ల‌లోనే క‌నిపిస్తున్నారు. దెందులూరు చాలా కాలం క్రితం వెళ్లాను. మ‌ళ్లీ వెళ్ల‌లేదని గుర్తు చేసుకున్నారు.