Begin typing your search above and press return to search.

నాగార్జున బర్త్​ డే.. పాన్ ఇండియా ప్రాజెక్ట్​ కన్ఫామ్​

ఇప్పుడు తాజాగా శేఖర్​ కమ్ముల-ధనుశ్​ సినిమాలో నాగార్జున నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

By:  Tupaki Desk   |   29 Aug 2023 9:45 AM GMT
నాగార్జున బర్త్​ డే.. పాన్ ఇండియా ప్రాజెక్ట్​ కన్ఫామ్​
X

అక్కినేని హీరో నాగార్జున తన కొత్త సినిమాల అఫీషియల్​ అనౌన్స్​మెంట్ వరుసగా వస్తున్నాయి. నేడు(ఆసస్ట్ 29) ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్​. ఇప్పుడు తాజాగా శేఖర్​ కమ్ముల-ధనుశ్​ సినిమాలో నాగార్జున నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

బంగార్రాజు సినిమా తర్వాత కూడా అక్కినేని ఫ్యాన్స్​ను నాగార్జున పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నాగ్ కొత్త సినిమాల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వైల్డ్ డాగ్‌.. ది ఘోస్ట్‌తో రాగా అది కూడా తీవ్ర నిరాశ పరిచింది. దీంతో కథల ఎంపిక విషయంలో మరింత శ్రద్ధ తీసుకున్న నాగ్ చాలా గ్యాప్​ ఇచ్చి అభిమానుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు.

ఈ క్రమంలోనే నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త చిత్రాలను తెలియజేస్తున్నారు. శేఖర్ కమ్ముల సినిమాలో నటించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మూవీటీమ్​ నాగ్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ నోట్​ను విడుదల చేసింది.

"శేఖర్ కమ్ముల-ధనుశ్​తో చేయబోయే పాన్ ఇండియా సినిమాకు మాకు ఓ పవర్​హౌస్​ కావాలి. దానికి కింగ్ నాగార్జుననే సరైనడు. విష్​ యూ ఏ హ్యాపీ బర్త్​డే నాగార్జున. మరోసారి మీతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం" అంటూ సునీల్​ నరంగ్​, పస్కుర్​ రామ్ మోహన్ రావ్​ స్పెషల్ విషెస్ తెలిపారు.

ఇక ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా రష్మిక నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు నాగార్జున 'నా సామిరంగ' అనే కొత్త సినిమాను కూడా ప్రకటించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ విజయ్ బన్నీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజైన టీజర్‌కు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ గ్లింప్స్​లో నాగార్జున కట్టూ, మాట తీరు పక్కా మాస్​గా ఉంది. నాగార్జున స్టైలిష్​గా బీడీ కాల్చుకుంటూ అందులోనూ లుంగీ వేసుకుని సూపర్​ మాస్​ లుక్​లో కనిపించారు ప్రచార చిత్రం చివర్లో.. 'ఈ సారి పండక్కి నా సామిరంగ'.. అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ హైలైట్​గా నిలిచింది. ఈ సినిమా వచ్చే సంకాంత్రికి రిలీజ్ కానుంది.