Begin typing your search above and press return to search.

నాగార్జున నెక్స్ట్.. మళ్లీ అదే సస్పెన్స్..!

ప్రస్తుతం కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ నా సామిరంగ సినిమా చేస్తున్నాడు నాగార్జున.

By:  Tupaki Desk   |   3 Jan 2024 1:30 AM GMT
నాగార్జున నెక్స్ట్.. మళ్లీ అదే సస్పెన్స్..!
X

కింగ్ నాగార్జున ఒకప్పుడు ఉన్నంత వేగంగా సినిమాలు చేయట్లేదని చెప్పొచ్చు. సినిమా ఫలితాల వల్ల లేట్ చేస్తున్నాడా లేదా కథల విషయంలో సాటిస్ఫై అవ్వక ఎదురుచూస్తున్నాడా అన్నది తెలియదు కానీ సినిమా వెంట సినిమా చేసే నాగార్జున ఒక్కో సినిమాకు చాలా టైం తీసుకుంటున్నారు. ప్రస్తుతం కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ నా సామిరంగ సినిమా చేస్తున్నాడు నాగార్జున. ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ గా సంక్రాంతి కానుకగా వస్తుంది. నా సామిరంగ టీజర్, ట్రైలర్ అక్కినేని ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చాయి.

ఈ సినిమా తర్వాత నాగార్జున నెక్స్ట్ సినిమా మళ్లీ కన్ ఫ్యూజన్ లోనే ఉంది. అసలైతే రైటర్ ప్రసన్న కుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే అతను చేయాలనుకున్న సినిమా కూడా నా సామిరంగ కథే కావడంతో ఆ ప్రయత్నం మానుకున్నారు. అయితే రైటర్ ప్రసన్న కుమార్ నాగార్జునతో మరో సినిమా ప్రయత్నంలో ఉన్నాడని. నాగ్ కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. అయితే అది ఎప్పుడు సెట్ అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది.

ఇక మరోపక్క నాగార్జున తన 100వ సినిమా తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్ లో చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు. ఈ సినిమాలో అక్కినేని అఖిల్ కూడా నటిస్తాడని సినిమా అక్కినేని ఫ్యాన్స్ కి బాగా నచ్చేస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమాను కూడా హోల్డ్ లో పెట్టారట నాగార్జున. తనని ఎగ్జైట్ చేసే కథల కోసం కొద్దిరోజులుగా వెతుకుతున్న నాగార్జున అందుకు రైటర్స్, డైరెక్టర్స్ తో చర్చలు కొనసాగిస్తున్నారని తెలుస్తుంది.

సాధ్యమైనంతవరకు రీమేక్ లకు నో చెప్పాలని చూస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున చేస్తున్న నా సామిరంగ సినిమా కూడా మలయాళ సినిమా పొరింజు మరియం జోస్ సినిమాకు రీమేక్ గా వస్తుంది. సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు కూడా నటించారు. నాగార్జున సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. సంక్రాంతి స్టార్ ఫైట్ లో నా సామిరంగతో సత్తా చాటాలని చూస్తున్నారు నాగార్జున. ప్రచార చిత్రాలు సూపర్ బజ్ ఏర్పరచగా సంక్రాంతి సూపర్ హిట్ సెంటిమెంట్ ఈసారి కూడా నాగార్జున కొనసాగిస్తారా లేదా అన్నది మరో రెండు వారాల్లో తెలుస్తుంది.