Begin typing your search above and press return to search.

మైసూర్ టూ హైద‌రాబాద్ ఇది కింగ్ షెడ్యూల్!

కింగ్ నాగార్జున బిజీ బిజీగా ఉన్నారా? హైద‌రాబాద్ టూ మైసూర్ రౌండ్లు వేస్తున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   11 Nov 2023 11:30 AM GMT
మైసూర్ టూ హైద‌రాబాద్ ఇది కింగ్ షెడ్యూల్!
X

కింగ్ నాగార్జున బిజీ బిజీగా ఉన్నారా? హైద‌రాబాద్ టూ మైసూర్ రౌండ్లు వేస్తున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. బేసిక్ గానే నాగార్జున ఫుల్ బిజీ. సినిమాల‌తో పాటు స్టూడియో ప‌నులు..ఇత‌ర వ్యాపార‌ల్లోనూ నిత్యం బిజీగా ఉంటారు. కొన్నాళ్ల‌గా బిగ్ బాస్ రియాల్టీ షోని కూడా హోస్ట్ చేయ‌డంతో మ‌రింత బిజీగా మారారు. ప్ర‌స్తుతం ఆయ‌న క‌థానాయ‌కుడిగా విజ‌య్ బిన్ని ద‌ర్శ‌క‌త్వంలో `నా సామీరంగ` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

నిన్న‌మొన్న‌టివ‌ర‌కూ హైద‌రాబాద్ లో చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. ప్ర‌స్తుతం మైసూర్ లో షెడ్యూల్ జ‌రుగుతోంది. దీనిలో భాగంగా నాగార్జున స‌హా ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఇదే షెడ్యూల్ లో ఓ పాట కూడా ప్లాన్ చేసారు. ఇంకా పాట‌కి సంబంధించిన షూట్ మొద‌ల‌వ్వ‌లేదు. యూనిట్ స‌న్నివేశాల చిత్రీక‌రణ పైనే బిజీగా ఉంది. ఆ పాట షూట్ కోసం ఎక్కువ రోజులే కేటాయించిన‌ట్లు స‌మాచారం. సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారుట‌.

మ‌రోవైపు హైద‌రాబాద్ లో బిగ్ బాస్ షూట్ కూడా జ‌రుగుతోంది. దీంతో నాగార్జున హైద‌రాబాద్ టూ మైసూర్ తిర‌గాల్సి వ‌స్తోందిట‌. ఓ రోజు ఇలాగే క్లాష్ వ‌చ్చిందిట‌. రెండు షూట్లు ఒకేసారి ఉండ‌టంతో! హ‌డావుడిగా జ‌ర్నీ చేయాల్సి వ‌చ్చింద‌ని యూనిట్ వ‌ర్గాల నుంచి తెలిసింది. ప్లానింగ్ స‌రిగ్గా లేక‌పోవ‌డంతోనే ఇలా జ‌రిగింద‌ని తెలుస్తోంది. సెట్స్ కి ఆల‌స్యంగా వెళ్లినా నాగార్జున అద‌నంగా కేటాయించి ఆ రోజు షూట్ మొత్తం పూర్తయ్యేలా టీమ్ కి స‌హ‌క‌రిస్తున్న‌ట్లు స‌మాచారం.

సంక్రాంతి రిలీజ్ నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తిచేసే ప‌నిలోనే టీమ్ నిమ‌గ్న‌మైన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ బిజీ షెడ్యూల్ కార‌ణంగా కొన్ని బ్రాండింగ్స్ కి సంబంధించి షూట్ ని కూడా వాయిదా వేసిన‌ట్లు స‌మాచారం. నా సామిరంగ‌..బిగ్ బాస్ ల నుంచి పూర్తిగా ఖాళీ అయ్యేవ‌ర‌కూ మ‌రో షూట్లోపాల్గొనే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది.