Begin typing your search above and press return to search.

హీరోయిన్ కి నాగార్జున ఇంటి భోజ‌నం!

ఇటీవలే 'స‌లార్' హీరోయిన్ శ్రుతి హాస‌న్ ని పుడ్ తో ఎంత‌గా ఇబ్బంది పెట్టాడో చెప్ప‌క‌నే చెప్పింది.

By:  Tupaki Desk   |   11 Jan 2024 6:07 AM GMT
హీరోయిన్ కి నాగార్జున ఇంటి భోజ‌నం!
X

హీరోయిన్ల‌కు హీరోలు ఇంటి పుండ్ పంపిస్తోన్న జాబితా రోజు రోజుకి పెరిగిపోతుందా? హీరోయిన్ల పుడ్ విష‌యంలోనూ హీరోలు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారా? అంటే అవున‌నే అనాలి. సాధార‌ణంగా హీరోయిన్ల‌కు పుడ్ పంపించే అల‌వాటు ఉన్న హీరో ఎవ‌రంటే? అంద‌రికీ ట‌క్కున గుర్తొచ్చేది ప్ర‌భాస్. ఆయ‌న ఏ సినిమా చేసినా ఆయ‌న‌తో ప‌నిచేసిన హీరోయిన్ల‌కు ప్ర‌త్యేకంగా త‌న ఇంటి వంట‌కాలు తెచ్చి పెడుతుం టాడు. ర‌క‌ర‌కాల వెజ్...నాన్ వెజ్ అన్నింటిని రుచి చూపించ‌డం అన్న‌ది ఆయ‌న‌కు ఓ హాబీ లాంటింది.

ఇటీవలే 'స‌లార్' హీరోయిన్ శ్రుతి హాస‌న్ ని పుడ్ తో ఎంత‌గా ఇబ్బంది పెట్టాడో చెప్ప‌క‌నే చెప్పింది. తినే వ‌ర‌కూ ఊరుకునే వారు కాద‌ని...క‌డుపు ఉబ్బిబోయేలా తినిపించేవార‌ని చెప్పుకొచ్చింది. అలాగే పృథ్వీరాజ్ సుకుమార‌న్ అయితే ఏకంగా డార్లింగ్ పంపించిన పుడ్ కోసం అద‌నంగా ఓ గ‌ది ఎక్స్ ట్రా తీసుకోవాల్సి వ‌చ్చింది. ఇలా త‌న ఇంటి రుచులు చూపించ‌డం డార్లింగ్ కి బాగా అల‌వాటు. ఆ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా కీర్తి సురేష్ కి ఇలాగే త‌న ఇంటి నుంచి పుడ్ పంపించిన సంద‌ర్భం ఉంది.

'వాల్తేరు వీర‌య్య' షూటింగ్ స‌మ‌యంలో ఈ స‌న్నివేశం చోటు చేసుకుంది. త‌న ఇంటి త‌మిళ్ కుక్ తో ప్ర‌త్యేక వంట‌కాలు చేయించి పంపించేవారు. భోజ‌నానికి ఇబ్బంది అవుతుంద‌ని కీర్తి చెప్ప‌డంతోనే చిరు ఆ నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా ఈ వ‌రుస‌లోకి కింగ్ నాగార్జున కూడా చేరిపోయారు. ఆయ‌న కూడా హీరోయిన్ ఆషికా రంగ‌నాధ్ కి త‌న ఇంటి వంట‌కాలు పంపిచిన‌ట్లు తాజాగా `నా సామిరంగ` ప్రీ రిలీజ్ వేడుక‌లో రివీల్ చేసింది. ఈ సినిమాలో అమ్మ‌డు నాగ్ కి జోడీగా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

క‌న్న‌డ బ్యూటీ ఈసినిమా కోసం హైద‌రాబాద్ లో బ‌య‌ట హోట‌ల్ లో ఉంటుంది. రోజు హెట‌ల్ పుడ్ తింటే ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని భావించిన నాగార్జున స్వయంగా త‌న ఇంటి నుంచి రోజు కేరియ‌ర్ పంపిచేవారుట‌. ఆ ర‌కంగా నాగార్జున ఇల్లు ఆషికాకి రెండ‌వ సొంతిల్లుగా మారిపోయింద‌ని చెప్పుకొచ్చింది.