Begin typing your search above and press return to search.

'క‌ల్కీ'పై కొత్త ప్ర‌చారం మ‌ళ్లీ ఇదేం ట్విస్ట్!

తాజాగా ప‌ర‌శ‌రాముడి పాత్ర‌లో కింగ్ నాగార్జున న‌టిస్తున్నట్లు కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. సినిమాలో ఈ పాత్ర ఎంతో కీల‌క‌మైన‌దిట‌.

By:  Tupaki Desk   |   8 April 2024 5:19 AM GMT
క‌ల్కీపై కొత్త ప్ర‌చారం మ‌ళ్లీ ఇదేం ట్విస్ట్!
X

ఇండియాస్ మోస్ట్ అవైటైడ్ పాన్ ఇండియా చిత్రం 'క‌ల్కి2898' భారీ కాన్వాస్ పై తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈసైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ ద్వారా ఏకంగా ప్యూచ‌ర్ ఇండియాని చూపించ‌బోతున్నారు. ఇండియ‌న్ స్క్రీన్ పై ఇంత వ‌ర‌కూ ఏ ద‌ర్శ‌కుడు చేయ‌ని అతి పెద్ద సాహ‌సాన్ని నాగ్ అశ్విన్ చేస్తున్నాడు. ప్ర‌భాస్ హీరోగా..దీపికా ప‌దుకొణే హీరోయిన్ గా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతుంది. అమితాబాచ్చ‌న్..క‌మ‌ల్ హాస‌న్ లాంటి లెజెండ‌రీ న‌టులు సైతం ఇందులో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ప‌సుప‌తి..స‌స్వాత్ ఛ‌ట‌ర్జీ లాంటి ట్యాలెంటెడ్ న‌టులు భాగ‌మయ్యారు. అయితే ఇందులో మెయిన్ విల‌న్ ఎవ‌రు? అన్న‌ది ఇంత వ‌ర‌కూ క్లారిటీ లేదు. మొన్న‌టి వర‌కూ ఆ బాధ్య‌త‌లు క‌మ‌ల్ హాస‌న్ తీసుకున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. కానీ సినిమాలో తాను విల‌న్ కాద‌ని ఓ గెస్ట్ రోల్ లాంటింది మాత్ర‌మే చేస్తున్నాన‌ని క్లారిటీ ఇచ్చేసారు. ఇప్ప‌టికీ విల‌న్ పాత్ర‌ధారి స‌స్పెన్స్ గానే క‌నిపిస్తుంది. ఇంకా సినిమాలో ఇలాంటి స‌స్పెన్స్ పాత్ర‌లు మ‌రికొన్ని ఉన్నాయి.

అవే ప‌ర‌శ‌రాముడి పాత్ర‌-కృపాచార్యుడి రోల్. ఇందులో తార‌క్ ప‌ర‌శ‌రాముడి పాత్ర పోషిస్తున్న‌ట్లు ..కృపాచార్యుడి పాత్రలో నాని న‌టిస్తున్నాడ‌ని ప్ర‌చారం సాగింది. తాజాగా ప‌ర‌శ‌రాముడి పాత్ర‌లో కింగ్ నాగార్జున న‌టిస్తున్నట్లు కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. సినిమాలో ఈ పాత్ర ఎంతో కీల‌క‌మైన‌దిట‌. ఓ స్టార్ హీరో మాత్ర‌మే ఆ పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని భావించి తుదిగా నాగ్ ని ఫైన‌ల్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. మ‌రి ఆ ప్ర‌తిష్టాత్మ‌క రోల్ తార‌క్ పోషిస్తున్నాడా? కింగ్ న‌టిస్తున్నాడా? అన్న‌ది చిత్ర వ‌ర్గాల నుంచి క్లారిటీ రావాల్సిందే.

అలాగే కృపాచార్యుడి రోల్ కి సంబంధించి కూడా అధికారిక స‌మాచారం లేదు. మ‌రోవైపు సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర పుడుతోన్న వేళ కొత్త పాత్ర‌లు తెర‌పైకి రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారుతుంది. నిజంగా సినిమా మే 9న సినిమా రిలీజ్ అవుతుందా? అన్న సందేహం క‌నిపిస్తుంది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.