Begin typing your search above and press return to search.

బిగ్ బాస్‌: శివాజీని నాగార్జున ఎందుక‌లా తిట్టారు?

పాశ్చాత్య దేశంలో పుట్టుకొచ్చిన బిగ్ బాస్ రియాలిటీ షో చాలా కాలం క్రిత‌మే ఇండియాని క‌బ‌ళించింద‌న్న విమ‌ర్శ‌లున్నాయి.

By:  Tupaki Desk   |   20 Nov 2023 4:08 AM GMT
బిగ్ బాస్‌: శివాజీని నాగార్జున ఎందుక‌లా తిట్టారు?
X

పాశ్చాత్య దేశంలో పుట్టుకొచ్చిన బిగ్ బాస్ రియాలిటీ షో చాలా కాలం క్రిత‌మే ఇండియాని క‌బ‌ళించింద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. దీనిని సాంప్ర‌దాయ‌వాదులు క‌ల్చ‌ర్ విధ్వంశంగా అభివ‌ర్ణిస్తున్నారు. అయినా బిగ్ బాస్ రియాలిటీ దేశంలోని అన్ని భాష‌ల్లోను విశేష ఆద‌ర‌ణ పొందుతోంది. హిందీ-త‌మిళం-మ‌ల‌యాలం-తెలుగు-క‌న్న‌డం అన్ని భాష‌ల్లోను బిగ్ బాస్ అవిరామంగా ఎంట‌ర్ టైన్ చేస్తోంది. మాస్ జ‌నాద‌ర‌ణ బిగ్ బాస్ విజ‌యంలో కీల‌క భూమిక పోషిస్తోంద‌నేది నిర్వివాదాంశం.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఇంట్లో పార్టిసిపెంట్స్ కి ఇచ్చే టాస్కులు కానీ, వారి అభినివేశం కానీ చాలా మందికి రుచించ‌నివి. రెగ్యుల‌ర్ ఫార్మాట్ లో కాల‌యాప‌న చేసేవి అన్న విమ‌ర్శ‌లున్నాయి. వ‌ల్గారిటీ షో లేదా అన‌వ‌స‌ర వృథా వ్యాప‌కంగా దీనిని చాలామంది చూస్తున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాక అక్క‌డ జంట‌లు ప్రేమ‌లో ప‌డ‌డం వ‌ల్గ‌ర్ గా ప్ర‌వ‌ర్తించ‌డం ప్ర‌యివేట్ విష‌యాల్ని బ‌హిర్గ‌తం చేయ‌డం, బూతు పురాణం వంటివి జుగుప్సాక‌రంగా మారాయి. ఇటీవ‌ల బెడ్ రూమ్ స‌న్నివేశాలు, పెద‌వి ముద్దులు వంటి టాస్కులు కూడా కుటుంబ ఆడియెన్ కి ఊహించ‌ని షాక్ గా మారుతున్నాయి. హిందీ బిగ్ బాస్ లో ఇది శ్రుతిమించింది. తాజాగా తెలుగు బిగ్ బాస్ 11వ వారం తరువాత, హోస్ట్ నాగార్జున హౌస్‌మేట్‌ల టాస్కుల‌ను తెలుసుకోవటానికి షో సెట్స్‌పైకి వచ్చారు.

హౌస్ మేట్ ప్ర‌వ‌ర్త‌న‌పై కలత చెందిన నాగార్జున శివాజీ సహా పోటీదారులందరినీ మంద‌లించారు. అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించినందుకు నటుడు శివాజీపై విరుచుకుపడ్డాడు. శివాజీ సివిక్ సెన్స్ బాధ్యతాయుతంగా ప్రవర్తించే సామర్థ్యంపై నాగార్జున ప్రశ్నించారు. తన అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి, నాగార్జున ఎవిక్షన్-ఫ్రీ టాస్క్‌లు, కెప్టెన్సీ టాస్క్‌లను ఎత్తి చూపారు. ముఖ్యంగా శివాజీ ఉప‌యోగించిన ప‌రుష‌ప‌ద‌జాలాన్ని ప‌దే ప‌దే నాగార్జున ప్ర‌శ్నించారు. వెర్రి పుష్ప లాంటి ప‌దాల‌ను శివాజీ అలవోక‌గా మాట్లాడ‌టాన్ని ప్రేక్ష‌కులు హర్షించ‌రు అంటూ నాగార్జున మంద‌లించారు. దానికి శివాజీ చాలా సార్లు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సి వ‌చ్చింది. స‌ర‌దాగానో లేదా త‌క్ష‌ణం అల‌వాటుగా ఉప‌యోగించిన ప‌దాలు అవి అని స‌ర్ధి చెప్ప‌బోయిన శివాజీని నాగార్జున ఎంత‌మాత్రం ఉపేక్షించ‌లేదు. అయితే ఇంటిలో ప‌రుష‌ప‌ద‌జాలం, అస‌భ్య‌క‌ర జుగుప్సాక‌ర ప్ర‌వ‌ర్త‌న‌ల‌పై బిగ్ బాస్ చెక్ పెట్టాల‌నుకోవ‌డం హ‌ర్ష‌ణీయం.

ఇంట్లో ఇప్పుడు అమర్‌దీప్, గౌతమ్, రాధిక, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ప్రియాంక ఉన్నారు. మునుముందు వారాల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 హౌస్‌లో మరిన్ని డ్రామాలు, గాసిప్‌లు, వివాదాలు వేడెక్కించ‌నున్నాయి. బిగ్ బాస్ ఇల్లు చాలా ఆశ్చర్యకరమైన కుంభకోణాలతో హీట్ పెంచుతోంది.