Begin typing your search above and press return to search.

కింగ్ నుంచి మ‌రో కొత్త మేక‌ర్ దిగుతున్నాడా?

కింగ్ నాగార్జున కొత్త వాళ్ల‌కి ఛాన్స్ ఇవ్వ‌డంలో ముందుంటార‌ని చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   6 Jan 2024 9:58 AM GMT
కింగ్ నుంచి మ‌రో కొత్త మేక‌ర్ దిగుతున్నాడా?
X

కింగ్ నాగార్జున కొత్త వాళ్ల‌కి ఛాన్స్ ఇవ్వ‌డంలో ముందుంటార‌ని చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండ‌స్ట్రీలో కొత్త‌త‌రాన్ని ప్రోత్స‌హించే ఎవ‌రంటే? అంద‌రికీ గుర్తొచ్చేది నాగార్జున పేరునే. ఆయ‌న ఇండ‌స్ట్రీకి ఎంతో మంది డైరెక్ట‌ర్ల‌నీ ప‌రిచ‌యం చేసారు. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా తెర‌కెక్కుతోన్న `నా సామీరంగ` చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న విజ‌య్ బిన్నీ కూడా కొత్త వ్య‌క్తి అన్న‌ది దెలిసిందే. కొరియోగ్రాప‌ర్ గా ఉన్న విజ‌య్ బిన్నీ నాగ్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ సినిమా ప్ర‌చార చిత్రాలు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. దీంతో అంచ‌నాలు భారీగానే ఏర్ప‌డుతున్నాయి. సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అవుతున్న సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఇక అంత‌కు ముందే నాగ్ మ‌రో శుభ‌వార్త చెప్ప‌డానికి సిద్ద‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. మరో కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేసే బాధ్య‌త తీసుకున్న ట్లు వినిపిస్తుంది.

రైటింగ్ డిపార్ట్ మెంట్ లో ప‌నిచేస్తోన్న సుబ్బు అనే కొత్త కుర్రాడిని కూడా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేయ‌డా నికి రెడీ అవుతున్న‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో టాక్ న‌డుస్తోంది. వాస్త‌వ సంఘ‌ట‌న‌ల్ని ఆధారంగా చేసుకుని సిద్దం చేసిన ఓ స్టోరీని నాగ్ కి వినిపించి మెప్పించాడుట సుబ్బు. ఇది ఓ కోర్ట్ రూమ్ డ్రామా అని అంటు న్నారు. అందులో నాగ్ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని వినిపిస్తుంది.

మ‌రి ఇందులో వాస్త‌వం తెలియాల్సి ఉంది. కోర్ట్ రూమ్ డ్రామాలు ఈ మ‌ధ్య కాలంలో తెలుగులో కూడా బాగానే స‌క్సెస్ అవుతు న్నాయి. ఓటీటీలో రిలీజ్ అయిన సూర్య `జై భీమ్` కోర్ట్ రూమ్ నేప‌థ్యంలో తెర‌కెక్కి న సినిమా ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన `వ‌కీల్ సాబ్ కూడా ప్రేక్ష‌కుల్ని బాగానే అల‌రించింది. మ‌రి నాగార్జున కంటెంట్ సంగ‌తేంటో? తేలాలి. దానిపై క్లారిటీ కూడా రావాలి.