Begin typing your search above and press return to search.

కింగ్ సెంచ‌రీ కొట్టేది @ 64 లోనే!

'విక్ర‌మ్ నుంచి 'ది ఘోస్ట్' వ‌ర‌కూ 37 ఏళ్ల సినీ కెరీర్ లో 98 చిత్రాలు దిగ్గిజ‌యంగా పూర్తి చేసి 64వ పుట్టిన రోజులోకి అడుగు పెట్టారు.

By:  Tupaki Desk   |   29 Aug 2023 7:59 AM GMT
కింగ్ సెంచ‌రీ కొట్టేది @ 64 లోనే!
X

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వార‌సుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఏఎన్నార్ పెద్ద స్టార్ అయినా ఆయ‌న ఇమేజ్ ఏమాత్రం ప‌డ‌కుండా ప‌రిశ్ర‌మ‌లో ఎదిగిన‌టు డాయ‌న. అంత పెద్ద స్టార్ కుమారుడైనా నాగార్జున కూడా అమితాబ‌చ్చ‌న్ చాలా విమ‌ర్శ‌లు..అవ‌మానాలు ఎదుర్కున్నారు. నాగార్జున బ‌క్క‌ప‌ల‌చ‌ని శ‌రీర సౌష్టవం చూసి హీరోగా ప‌నికాడు అన్నారు.

డైలాగ్ డెలివిరీ బాగోలేద‌న్నారు. కానీ ఆ విమ‌ర్శ‌ల‌న్నింటికీ నాగ్ త‌న న‌ట‌న‌తోనే స‌మాధానం ఇచ్చారు. ఇత‌నేం హీరో అన్న‌వారితోనే? హీరో అంటే ఇలాగే ఉండాల‌ని తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓ ముద్ర వేసారు. క్లాస్ అయినా..మాస్ అయినా..భ‌క్తి అయినా..ర‌క్తి అయినా నాగ్ కి మాత్ర‌మే చెల్లింద‌నిపించారు. 63 ఏళ్ల కెరీర్ లో ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించారు.

'విక్ర‌మ్ నుంచి 'ది ఘోస్ట్' వ‌ర‌కూ 37 ఏళ్ల సినీ కెరీర్ లో 98 చిత్రాలు దిగ్గిజ‌యంగా పూర్తి చేసి 64వ పుట్టిన రోజులోకి అడుగు పెట్టారు. నేడు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా 99వ చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రాన్ని కొరియోగ్రాఫ‌ర్ విజ‌య్ బిన్నీ తెర‌కెక్కిస్తున్నారు. 'నాసామీ రంగ' అనే టైటిల్ పోస్ట‌ర్...నాగ్ లుక్ రివీల్ చేసారు. నాగ్ మాస్ లుక్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇక ఇదే ఏడాది కింగ్ సెంచ‌రీ కూడా కొట్టే అవ‌కాశాలున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ చిత్రాన్ని ప‌తిష్టాత్మ‌కంగా ప్లాన్ చేయ‌నున్నారు. ల్యాండ్ మార్క్ మూవీ కాబ‌ట్టి అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుని హిట్ కంటెంట్ తోనే బాక్సాఫీస్ వ‌ద్ద మోత మోగించడానికి అవ‌కాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఎలాంటి స్టోరీతో వ‌స్తారు? ఏ ద‌ర్శ‌కుడిని తీసుకుంటారు? అన్న‌ది ఆస‌క్తిక‌రమైన అంశం. అయితే ఈ సినిమా మాత్రం అన్న‌పూర్ణ స్టూడియోస్ లో నే ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్ తో నిర్మించే అవ‌కాశం ఉంది. బ‌య‌ట బ్యాన‌ర్ కి ఛాన్సెస్ త‌క్కువ‌గా ఉండొచ్చు.