ఆయనకేదీ ఓ పట్టాన నచ్చదు..
అయినా నచ్చకపోవడంతో మెయిన్ హీరోగా కాకుండా ఇతర హీరోలు నటిస్తున్న సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి కొత్తగా ప్రయత్నిస్తున్నారు నాగ్.
By: Tupaki Desk | 15 July 2025 3:00 PM ISTటాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమాల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారనే విషయం తెలిసిందే. గత కొన్ని సినిమాలుగా అనుకున్న విధంగా ఫామ్ లో లేని నాగార్జున నా సామిరంగతో మంచి ఫలితాన్నే అందుకున్నారు. ఆ సినిమా తర్వాత తన మైల్ స్టోన్ మూవీ అయిన నాగ్100 కోసం ఆయనెంతో వెయిట్ చేశారు. ఎందరో డైరెక్టర్లను కలిసి వారు చెప్పిన కథలు విన్నారు.
అయినా నచ్చకపోవడంతో మెయిన్ హీరోగా కాకుండా ఇతర హీరోలు నటిస్తున్న సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి కొత్తగా ప్రయత్నిస్తున్నారు నాగ్. అలా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా వచ్చిన కుబేర సినిమాలో నటించి నటుడిగా చాలా మంచి ప్రశంసలు అందుకున్నారు నాగార్జున. కుబేరతో పాటూ నాగ్, సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమాలో కింగ్ నాగ్ సైమన్ అనే పాత్రలో నటించారు. కూలీలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, గత 40 ఏళ్లలో చూడని కొత్త వెర్షన్ ను కూలీలో చూస్తారని నాగ్ మొన్నామధ్య కుబేర ప్రమోషన్స్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, కూలీలో తాను విలన్ రోల్ చేసినట్టు కూడా నాగ్ లీక్ చేశారు.
దీంతో నాగ్ ను విలన్ గా ఎప్పుడెప్పుడు చూస్తామా అని అక్కినేని ఫ్యాన్స్ కూలీ కోసం ఎదురుచూస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సైమన్ పాత్ర కోసం నాగార్జునను ఒప్పించడం అంత తేలికగా జరగలేదని రీసెంట్ గా డైరెక్టర్ లోకేష్ వెల్లడించారు. సైమన్ క్యారెక్టర్ ఐడియా ఆయనకు నచ్చినప్పటికీ దాన్ని తీర్చిదిద్దడం తనకు ఛాలెంజ్ గా మారిందని లోకేష్ చెప్పారు.
అందులో భాగంగానే నాగ్ పాత్ర నెరేషన్ కోసం లోకేష్ అతన్ని ఏడెనిమిది సార్లు కలిసినట్టు వెల్లడించారు. నాగ్ సార్ కు ఏదీ ఓ పట్టాన నచ్చదని, ఆయన్ని ఒప్పించడం చాలా కష్టమని లోకేష్ తెలిపగా, నాగ్ గురించి లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. కూలీ సినిమాలో నాగ్ తో పాటూ ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శృతి హాసన్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు చేస్తుండగా, ఆగస్ట్ 14న కూలీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
