Begin typing your search above and press return to search.

వెంకీ, నాగ్ ఆలస్యం అమృతం విషం..!

ఒక సినిమా హిట్ కొట్టగానే వెంటనే మరో ప్రాజెక్ట్ మొదలు పెట్టేయడం కామనే. కానీ కొందరు హీరోలు మాత్రం హిట్టు పడ్డాక కూడా ఇంకా టైం పాస్ చేస్తుంటారు.

By:  Tupaki Desk   |   7 May 2025 3:45 AM
వెంకీ, నాగ్ ఆలస్యం అమృతం విషం..!
X

ఒక సినిమా హిట్ కొట్టగానే వెంటనే మరో ప్రాజెక్ట్ మొదలు పెట్టేయడం కామనే. కానీ కొందరు హీరోలు మాత్రం హిట్టు పడ్డాక కూడా ఇంకా టైం పాస్ చేస్తుంటారు. అది కూడా దాదాపు 80, 90 కి పైగా సినిమాల అనుభవం ఉన్న స్టార్స్ ఇలా హిట్టు పడ్డాక కూడా వెయిట్ చేయడం వెనుక రీజన్ ఏంటన్నది తెలియట్లేదు. ఈ లిస్ట్ లో ఉన్న ఇద్దరు హీరోలు ఎవరంటే.. ఒకరు కింగ్ నాగార్జున కాగా.. మరొకరు విక్టరీ వెంకటేష్.

రెండేళ్ల క్రితం నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు నాగార్జున. ఆ సినిమాను విజయ్ బిన్ని డైరెక్ట్ చేశారు. అతను సొంత కథతో వస్తే రీమేక్ సినిమా ఇచ్చి ప్రాజెక్ట్ హిట్ అందుకున్నారు. ఐతే నా సామిరంగ తర్వాత నాగార్జున నెక్స్ట్ సినిమా విషయంలో జాప్యం చేస్తున్నారు. ఈ గ్యాప్ ఎందుకన్నది తెలియదు కానీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అప్సెట్ లో ఉన్నారు.

ఇక మరోపక్క విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఏం చేస్తారు అన్నది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఒకటి రెండు కథలు హోల్డ్ లో పెట్టారని టాక్. వెంకటేష్ సాటిస్ఫైడ్ గా లేరని టాక్. యువ హీరోలేమో ఒక పక్క సినిమా వెంట సినిమా చేస్తూ వెళ్తుంటే ఇన్నేళ్ల అనుభవం ఉన్న ఈ స్టార్స్ ఇద్దరు నెక్స్ట్ సినిమా కోసం చాలా టైం తీసుకుంటున్నారు.

ఐతే అదేదో సామెత ఉన్నట్టు ఆలస్యం అమృతమే కానీ ఆ తర్వాత విషం కూడా అయ్యే ఛాన్స్ ఉంది. తీరా రెండేళ్లు అలా గ్యాప్ తీసుకుని అంచనాలకు తగిన సినిమాతో రాకపోటే ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఆ విషయంలో వెంకీ, నాగ్ ఏం ఆలోచిస్తున్నారో తెలియదు కానీ వారి నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం మాత్రం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఐతే వారి వెర్షన్ ఏంటంటే ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేసి ఫ్యాన్స్ ని నిరాశపరచడం కన్నా మంచి బ్లాక్ బస్టర్ కథతో రావాలని చూస్తున్నారు. ఐతే ఆ డెసిషన్ మేకింగ్ త్వరగా చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వెంకటేష్, నాగార్జున ఇద్దరి బాక్సాఫీస్ కెపాసిటీ ఏంటన్నది ఆడియన్స్ కి తెలుసు.. సరైన కథతో వీరు చేస్తే ఫ్యాన్స్ అంతా పండగ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.