Begin typing your search above and press return to search.

నాలుగైదేళ్ల పాటు ప్లాపులొస్తే ఇండ‌స్ట్రీ ప‌నైపోయిన‌ట్లేనా?

రెండు సినిమాల్లోనూ నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్ర‌ల‌తో నాగార్జున‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు వ‌స్తుంద‌ని అంతా ఆశిస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 Jun 2025 12:57 PM IST
నాలుగైదేళ్ల పాటు ప్లాపులొస్తే ఇండ‌స్ట్రీ ప‌నైపోయిన‌ట్లేనా?
X

కింగ్ నాగార్జున కామ్ గోయింగ్ ప‌ర్స‌న్. వివాదాల‌పై స్పందించ‌రు. ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌లు..వివాదాలు ఏవైనా ఆయ‌న దృష్టికి తీసుకెళ్లినా? నిర్మొహ మాటంగా ఎలాంటి స‌మాధానం చెప్ప‌న‌నేస్తారు. ఇత‌ర హీరోలేవరైనా ఏదో చెప్పే ప్ర‌య‌త్న‌మైనా చేస్తారు గానీ నాగ్ మాత్రం నో ఛాన్స్ అని ముందే చెప్పేస్తారు. అలా చిత్ర ప‌రిశ్ర‌మలో నాగార్జున వివాద‌ర‌హితుడిగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న `కూలీ`, `కుబేర` సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

రెండు సినిమాల్లోనూ నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్ర‌ల‌తో నాగార్జున‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు వ‌స్తుంద‌ని అంతా ఆశిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌చారం ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా నాగార్జున చిత్ర ప‌రిశ్ర‌మ గురించి కొన్ని వ్య‌త్యాసాలు చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. ఇండ‌స్ట్రీలో ఎప్పు డూ ఒకే ప‌రిస్థితులుండ‌వ‌ని, ఒడిదుడుకులు స‌హ‌జ‌మ‌న్నారు. బాలీవుడ్..టాలీవుడ్ ఏ ప‌రిశ్ర‌మ కూడా ఎప్ప‌టికీ అగ్ర‌స్థానంలో ఉండ‌ద‌న్నారు.

బాలీవుడ్ కంటే బెట‌ర్ అయిన సినిమాలు టాలీవుడ్ తీస్తోన్న నేప‌థ్యంలో ఎదురైనా ప్ర‌శ్న‌కు నాగ్ నుంచి వ‌చ్చిన స‌మాధాన‌మ‌ది. ద‌క్షిణాదితో పోలీస్తే బాలీవుడ్ వెనుక‌బ‌డుతుందా? అంటే ఏ ప‌రిశ్ర‌మ‌లోనైనా ప‌రిస్థితులు ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతాయ‌న్నారు. న‌టులు , ద‌ర్శ‌కుల కెరీర్ లో 4-5 సంవ‌త్స‌రాల పాటు బ్యాడ్ టైమ్ న‌డుస్తుంద‌న్నారు.

వారి సినిమాలు విజ‌యం సాధించ‌క‌పోవ‌చ్చు. అప్పుడు సినిమా ప‌రిశ్ర‌మ మొత్తం ప‌డిపోయింద‌ని భావిస్తే పొర‌పాటు అవుతుంది. ప్రేక్ష‌కుల అంచ‌నాలు ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతూ ఉంటాయి. భ‌విష్య‌త్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయాల‌`న్నారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.