కింగ్ తో క్రైమ్ థ్రిల్లర్ సంచలనం!
కింగ్ నాగార్జున సోలో సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా కథలు విన్నారు.
By: Tupaki Desk | 26 April 2025 12:32 PM ISTకింగ్ నాగార్జున సోలో సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా కథలు విన్నారు. కానీ ఏవీ ఒకే అవ్వలేదు. రకరకాల డైరెక్టర్లు స్టోరీలు నేరేట్ చేసారు. వాళ్లలో కొందర్ని హోల్డ్ లో పెట్టారు. కానీ ఇంత వరకూ ఎవ్వర్నీ ఫైనల్ చేయలేదు. మరి ఇప్పుడు ఆ సన్నమైందా? కింగ్ సోలో ప్రాజెక్ట్ ఫిక్సై పోయిందా? అంటే తాజాగా అవుననే సమాధానం వస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా కింగ్ క్రైమ్ థ్రిల్లర్ సంచలనం శైలేష్ కొలనును తెరపైకి తెచ్చినట్లు వార్తలొస్తున్నాయి.
కింగ్ నాగార్జునకు స్టోరీలు చెప్పిన వాళ్లలో శైలేష్ కూడా ఉన్నాడని ఈ సందర్భంగా వెలుగులోకి వస్తోంది. కొన్ని నెలల క్రితమే నాగ్ కి స్టోరీ చెప్పారుట. నచ్చడంతో నాగ్ కూడా చేద్దామని మాట ఇచ్చారుట. కానీ అప్పటికీ ఇద్దరు బిజీగా ఉండటంతో? సాధ్యపడలేదని తాజాగా మరోసారి శేలేష్ నాగ్ ని కలిసి పాత స్టోరీకి ఇంకాస్త మెరుగులు దిద్ది వినిపించి లాక్ చేసినట్లు సన్నిహితుల నుంచి తెలిసింది.
ఇదీ శైలేష్ మార్క్ క్రైమ్ థ్రిల్లర్ అని అంటున్నారు. బిహార్ లో జరిగిన ఓ హత్య ఘటన ఆధారంగా ఈ కథను అల్లుకున్నట్లు లీకులందుతున్నాయి. ఇందు లో నాగ్ శక్తివంతైన పాత్రలో కనిపించనున్నారుట. శేలైష్ గత హీరోలకు భిన్నంగా నాగ్ రోల్ డిజైన్ చేసినట్లు వినిపిస్తుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో మేకర్స్ కన్పమ్ చేయాలి. ప్రస్తుతం శైలేష్ కొలను `హిట్ 3` రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
నాని హీరోగా తెరకెక్కించిన సినిమా మేలో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో టీమ్ అంతా ప్రచారం పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. హిట్ ప్రాంచైజీ నుంచి రిలీజ్ అవుతోన్న మూడవ చిత్రమిది. దీనికంటే ముందు విక్టరీ వెంకటేష్ తో మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ సైంధవ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు.
