నాగార్జున మాత్రం రూపాయి చిక్కనివ్వలేదు!
తాజాగా నాగార్జున కూడా నాన్న వాలెట్ లో డబ్బులు కొట్టేసిన వాడినే అంటూ ఓ సినిమా ఈవెంట్ లో రివీల్ చేసారు.
By: Tupaki Desk | 18 Jun 2025 4:42 PM ISTఅమ్మ పోపుల డబ్బాలో..నాన్న వాలెట్ లో డబ్బులు కొట్టేయడం చిన్నప్పుడు పరిపాటే. చేసే ఆ దొంగతనం తప్పే అయినా తెలిసి తెలియని వయసు కాబట్టే వాటిని సరదా పనులుగానే ట్రీట్ చేస్తుంటాం. అప్పుడ ప్పుడు అమ్మ చేతిలో...నాన్న చేతిలో దెబ్బలు కూడా తప్పవనుకోండి. తాజాగా నాగార్జున కూడా నాన్న వాలెట్ లో డబ్బులు కొట్టేసిన వాడినే అంటూ ఓ సినిమా ఈవెంట్ లో రివీల్ చేసారు.
యాంకర్ అడిగిన సరదా ప్రశ్నకు నాగార్జున ఎంతో ఓపెన్ గా సమాధానం చెప్పారు. తల ఉపుతూ నవ్వు తూ...ఎంతో చక్కగా సమాధానం ఇచ్చారు కింగ్. మరి మీ జేబులో డబ్బులు మీ అబ్బాయిలు కొట్టేయ లేదా? అంటే లేదు అన్నారు. ఎందుకంటే తన జేబులో వాలెంట్ మాత్రమే ఉంటుందని...అందులో డబ్బులు ఎప్పుడు ఉండవ్ అన్నారు. అంటే నాగార్జున ఈ విషయంలో ముందే జాగ్రత్త పడ్డారన్న మాట.
తనలాగే తన కొడుకులు ఆలోచిస్తే పరిస్థితి ఏంటి? జేబు ఖాళీ అవుతుందని గెస్ చేసిన నాగ్ ఎప్పుడు వాలెట్ లో డబ్బులు పెట్టుకుని ఉండరు. లేదంటే నాగచైతన్య, అఖిల్ అలా కొట్టేసే టైపు అయిండరు. ఏది ఏమైనా చిన్నప్పటి అల్లరి పనులు ఎప్పటికీ మరుపురానవివి. ఆ రోజులు తిరిగి రానివి. వందల వేల కోట్లు ఉన్నా? బాల్యం లో రూపాయి లేకపోయినా ఆ జీవితమే ఎంతో గొప్పగా అనిపిస్తుందని ఎంతో మంది సక్సెస్ పుల్ బిలీయనీర్స్ చెప్పి న మాటలు గుర్తొస్తున్నాయి.
ప్రస్తుతం నాగార్జున వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న `కూలీ`లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో విలన్ పాత్రలో నాగ్ మెప్పించ బో తున్నారు. అలాగే ధనుష హీరోగా నటిస్తోన్న `కుబేర`లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత నాగ్ ఇమేజ్ మారబోతుంది.